చిన్ననాటి ముచ్చట్లు 59
ఆనాటి చెన్నపట్నపు తెలుగునాయుళ్లు, శెట్లు, ఆరణిచలవ చాకొలెట్ బొద్దంచుపంచ గట్టి, మురుగులు గొలుసులు కన్పించునట్లు పొట్టిచొక్కా తొడిగి, తెల్లరాళ్ల అంటుజోళ్లు పెట్టుకొని, ముఖమున గాత్రముగా తిరుమణి శ్రీచూర్ణములు ధరించి ఆ మూడుచక్రాల త్రోపుడు బండిలో సవారి చేయుచున్న నాటి దృశ్యమును నేనెన్నటికిని మరువజాలను.
ఇట్లుండగా మొట్టమొదట వచ్చిన కొత్తరకపు బండి మద్రాసు కోచి (Madras Coach) దాని తరువాత బ్రూహామ్ అనే పెట్టెబండి వచ్చినది. దాని వెంట బొంబాయి కోచి (Bombay Coach), ఫీటన్ (Pheaton) లాండో, లాండోలెట్, డాక్కార్ట్ అనే మరికొన్ని రెండు చక్రములు 4 చక్రములుగల గుర్రపుబండ్లు వరుసగా రాసాగినవి. ఆ పిదప ట్రాము, మోటారుకారు వచ్చినవి.
నేను మొట్టమొదట మద్రాసు కోచిని వాడుచుంటిని. ఆ పిదప బొంబాయి కోచిని వాడితిని, ఆ తర్వాత క్రమముగా ఫీటన్, లాండోలెట్, లాండో బండ్లను వాడియుంటిని. ఆమధ్యకాలమందు వేలూరుజట్కాను ఉపయోగించితిని. కొన్నాళ్లు జోడుగుర్రముల బండిలో సవారి చేయు చుంటిని. మద్రాసునకు అప్పుడప్పుడు వచ్చుచుండిన ఆస్ట్రేలియన్ గుర్రములను, పెగు పోనీలను మంచి లక్షణములుగల వానినిగా కొని కొంతకాలము నావద్దయుంచుకొని పిమ్మట మంచి ధరచూచి అమ్ముచుంటిని.
1949 ఫిబ్రవరి 1వ తేదినుండి 160 లక్షల గాలన్లనీళ్లను మాత్రమే ప్రతిరోజు కార్పొరేషన్ వారు సప్లయి చేయగలిగిరి. అనగా తల 1 కి 10 గాలన్లు లేక 2 1/2 కిర్సనాయల్ డబ్బాల నీరు మాత్రమే. మద్రాసులో ఎక్కడ చూచినను నీటిఎద్దడి కబుర్లే. అయితే ఈస్థితి ఇటీవల జనము హెచ్చుటచేత