58 చిన్ననాటి ముచ్చట్లు
ఇరుసుపైన ఒక్కరు కూర్చుండుటకు తగిన ఆసనము అమర్చబడి యుండును. ఒక్కొక్కప్పడు ఆ చిన్నసీటుమీదనే, ముందువైపు తిరిగి కూర్చుండి బండి తోలువాని వీపునకు వీపునానించి పిల్లకాయలు కూర్చుండేవారు. దీనికి అందమైన పుంగనూరు పొట్టిఎద్దును కట్టుదురు. బండి తేలిక, ఎద్దు చురుకైనది. తోలేవాని చలాకీకొద్ది ఈ బండి అతివేగముగా పోవును. అప్పడు తరచు రేఖలా బండ్ల పందెములు జరుగుచుండేవి.
ఇవిగాక ఆరోజులలో మూడుచక్రముల వింతబండ్లుండేవి. వానిని మూడు చక్రముల త్రోపుడుబండ్లు అనేవారు. ఈబండ్లు ఆరోజులలో విస్తారముగ మధ్యతరగతివారి వద్ద ఉండేవి. గుర్రపుబండ్ల నుంచుకోగలిగిన పెద్ద గృహస్తులు కూడ చిన్న సవారీలకు ఈ బండ్ల నుంచుకొనేవారు; మార్కెట్ల సవారీకి, రాత్రి సవారికీ ఈ బండ్లనుపయోగించేవారు. ఈ బండి ముందుండు మూడవ చిన్న చక్రమునకు పడవ చుక్కానివంటిదొకటి అమర్చబడియుండును. బండిలోకూర్చున్న పెద్దమనిషి ఆ చుక్కాని చేబట్టి ఆ ముందు చక్రమును త్రిప్పుకొనుచుండును. బండిసాగుటకు వెనుకనుండి బోయీయొకడు బండి నెట్టును. సవారిచేయు పెద్దమనిషి భారీ అయినవాడైన ఇద్దరు తోసేవాండ్రుందురు. ధనవంతులు చేతికి బంగారు పెట్టుకొనే. బంగారు మురుగులు గొలుసులు నలుగురికి కనబడుటకై చొక్కాయి చేతులను పొట్టిగా కుట్టించుకొనేవారు. ఇవి ఎంతలావుగ నుండిన అంత ధనవంతుడని గొప్ప. ఆ కాలమున చెన్నపట్నములో సమీపస్థమగు ఆరణి, పొన్నేరి గ్రామముల చలవయన్న ప్రసిద్ది. ఆరోజులలో విస్తారము వాడుకలోనుండిన చాకులెట్ బొద్దంచు పంచలను ఆరణి చాకళ్ళు అంచుముడత పడకుండ నేర్పుగా చలవ చేసేవారు. మరియు నాకాలపు పురుషులును తెల్లరాళ్ల అంటుజోళ్లు, కమ్మలంతేసివి, పెట్టుకొనేవారు.