52 చిన్ననాటి ముచ్చట్లు
నీరుపోవుటకు సరియైన సైడు కాలువలు లేవు; అవి పిదప సం||ములలో కట్టబడినవి. వాననీరు నడివీధులలో నున్న గుంటలలో నిండెడిది; సూర్యరశ్మికే ఆరిపోవలయును. ఆలోపల దోమలుచేరి జుమ్మని తిరుగు చుండెడివి. ఎప్పడైనా మునిసిపాలిటీవారు దోవలనుచేసి ఈ వర్షపు నిలువ నీటిని ఆవల పోవుటుక మార్గము చూపేవారు. ఇండ్లలోని మురికినీరు పోవుటకు మునిసిపాలిటీవారు పెద్దకాలువలను నడివీధులలో త్రవ్వించి గారచేయించి, పైన నల్లబండలువేసి మూసేవారు. వానకాలమున ఈరోడ్డు అడుగుకాలువలు నీటితో నిండి పైకుబికి రోడ్డంతయు నీటిమయమై తెప్పతిరునాళ్లగా నుండెడిది. ఇండ్లలో ఊడ్చిన చెత్తచెదారము వేయుటకు నాడు వీధులలో కుప్పతొట్లు లేవు. మునిసిపాలిటీవారు కుప్పబండ్లను తీసుకొనివచ్చి, గృహస్థులు వీధులలో పారబోయించు కుప్పలను వానిలోకి ఎత్తుకొని వెళ్లేవారు. ఇండ్లలో ఊడ్చిన కుప్పను, మరుగుదొడ్లలోని మలమును కూడ ఒకేబండిలోనే తీసికొని వెళ్లేవారు. గుంట మిట్టలుగల రోడ్డున ఆ బండి ఎగిరెగిరిపడుచు పోవునప్పడు దానినుండి వెంట వీధుల వెంట చింది, అసహ్యముగా నుండెడిది.
నాకు తెలిసి వీధులలొ కిరసనాయిలు దీపములను వెలిగించుట జరుగుచుండెను. ఆ దీపస్తంభములు దూరదూరముగనే యుండెను. దీపములను వెలిగించువారు ముసిసిపాలిటీ వారిచ్చిన నూనెను పూర్తిగా ఉపయోగించని కారణమున ఆ గుడ్డిదీపములు త్వరగానే ఆరిపోయేవి. పట్నం త్వరగా చీకటిపడుచుండెను. పిదప గ్యాసులైట్లు వచ్చినవి. 1910 వరకున్నూ గ్యాసులైట్లే వెల్గినవి. అప్పడు ఈ విద్యుచ్ఛక్తి దీపములు వెలిసినవి.
ఆ కాలమున చెన్నపట్నములో పాతకాలపుశెట్లు, నాయుళ్లు, మొదలియార్లు మొదలగువారందరు ఒకవిధమగు తలపాగాలను