పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 37

రామయ్యంగారు, అణ్ణాస్వామి అయ్యరు, టి.వి. వేంకట్రామయ్యరు మున్నగువారు అనుకూలత చూపి ఆంధ్రుల అభిమానమును బడయుచుండిరి.

కేసరి హైస్కూలునందు రాధాకృష్ణశాస్త్రి (B.A.L.T., B.O.L.) అరవ అయ్యరు తెలుగు పండితులుగనుండి ఇటీవలనే రిటైరు అయినారు. వీరు తెలుగు గ్రంథములను కూడ వ్రాసిరి. ఇటువంటి అరవ తెలుగు పండితులు మద్రాసులో మరికొందరున్నారు.

నారాయణ మొదలి వీధిలో మొదట మేము కాపురముండిన ఇంటి వంట ఇండ్లు చాలా చిన్నవైనను, అరవతల్లి మంగళాంబ తన వంటగదిని అమిత పరిశుభ్రముగ నుంచుకొను నేర్పరిగ నుండెను. ఆమె ఆ చిన్న వంటగదిని చక్కగ చిమ్మి తడిగుడ్డతో తుడిచి ఆ రాతినేలను అద్దమువలె పెట్టుకొనుచుండినది. పానపాత్రలను బూడిదతో తోమి తళతళమని మెరయునట్లుగ చేసి వాటిని వంటయింటి అలమరలో చక్కగబోర్లించి పెట్టుచుండెను. అంట్లతప్పెలనుకూడ ఆమెయే తోముకొని బోర్ణించుచుండెడిది. ఇట్లు చేయుట వలన ఆ వంటయిల్లు అలంకారముగ నుండెడిది.

ఆదివారమునాడు అయ్యరు అంగడినుండి బియ్యము, పప్పు వగైరా సామానులు తెచ్చిన వెంటనే, ఇల్లాలు వెలుతురులో కూర్చుండి ఓపికతో రాళ్ళు రప్పలను యేరి తీసివేసి, మూతలుండు డబ్బాలలో పోసి జాజికాయ చెక్కలపెట్టెలో పెట్టి భద్రపరచుచుండెడిది. వారి భోజన సామగ్రినంతయు ఈ పెట్టెలోనే యిమిడ్చి పెట్టుకొనుచుండినది. చింతపండును తెప్పించి దానిలోనుండు విత్తులను, ఈనెలను, రాళ్లను తీసివేసి అందులో కొద్దిగ వుప్పును వేసి, మొత్తగ దంచి 30 వుండలను చేసి, యెండబెట్టి, జాడీలో పెట్టుకొనుచుండినది. ప్రతిదినము ఒక వుండను రాతిమరిగలో నానవేసి ఆ