Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు173

దీనికి శ్రీ శాస్త్రిగారే శాశ్వతాధ్యక్షులు. శాస్త్రులవారి నాటకములు తప్ప ఇతర నాటకములాడరాదు; శాస్త్రులవారివద్ద శిక్షణపొంది వారి అనుమతిపైగాని నాటకము వేయరాదు... అని నియమము లేర్పరచుకొనిరి.

శ్రీ శాస్త్రులవారి యాజమాన్యమున ఆంధ్రభాషాభిమాని సమాజము దినదిన ప్రవర్థమానమై చిరకాలము నడచినది. 1925లో రత్నావళీ నాటకముతో సరి మరి నాటకము వేయలేదు.

దొరసామి పేరు కందాడై శ్రీనివాసన్. ఈయన ఆంగ్లమున బి.ఏ.యల్.టి. కొన్నాళ్లు పచ్చయప్ప హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా నుండిరి. పిదప నెల్లూరిలో వెంకటగిరి రాజాగారి హైస్కూలు నందుపాధ్యాయులుగా నుండిరి. సంస్కృతమున పండితులు. సంగీతశాస్త్ర విశారదులు. భరతశాస్త్రనిధులు. మంచి శారీరము; సుందరమైన గంభీరవిగ్రహము, రాజఠీవి ఉట్టిపడుతుండేది. రాజవేషమున కాయనను చెప్పి మరి ఇంకొకరిని చెప్పవలయును. దుష్యంతుడుగా తుమ్మెదచే బాధపడుచున్న శకుంతల ఆర్తిని విని - 'ఎవడురవాడు?' అని ముందుకు దుముకునప్పుడు, ప్రతాపరుద్రుడుగా - 'మేము రాము' అని తురక సిపాయిలతో నిరాకరించి పలుకునప్పడు, ఉష శయ్యాగారమున అనిరుద్దుడుగా బాణాసురునితో నిర్లక్ష్యమున 'నీ అల్లుడను' అని చెప్పి - లాఘవమునలేచి అతనితో కలియబడునప్పడు - ఆ పొంకము చూడదగినదే గాని వర్ణింపతరముగాదు.

దొరసామి నాటక రంగస్థలము వీడక స్వంతముగా నొక నాటక సంఘమేర్పరచి తాముగా కల్పించిన హరిశ్చంద్ర నాటకము, కృష్ణలీలలు, బళ్లారివారి ప్రహ్లాద, శ్రీజయపురం మహారాజా విక్రమదేవవర్మగారి శ్రీనివాస కల్యాణము ఇత్యాది నాటకములను కొన్నిటినాడిరి. అందువరుసగా