142 చిన్ననాటి ముచ్చట్లు
అవి పూచినపుడు నాలుగు ప్రక్కలను రక్తవర్ణపు పూలతోరణముగ కనుబడును. ఈ గడ్డి నేల (Lawn) మధ్య సిమెంటుతో గుండ్రముగ నీళ్లతొట్టిని కట్టించి దానిమధ్య పూల కొళాయిని నిర్మించితిని. ఈ కొళాయి తిరుగునపుడు పూలవర్షము కురిసినట్లు, చక్రాకారముగను, పద్మాకారముగను నీళ్లను చిమ్ముచుండును. నీళ్లతొట్టిలో తామరపూల తీగెలను పెంచి పూలు పూయించితిని. ఈ పూలమధ్య బంగారురంగు, వెండిరంగు, ఎఱ్ఱ రంగుగల చేపలను తెచ్చి విడిచితిని. ఈ రంగుచేపలు నీళ్లలో యీదునపుడు తళతళయని మెరయుచుండును. ఇంటి ముఖ ద్వారపు మెట్లమీద డాలియా (Dhalia)యను పూలచెట్లను పెద్దతొట్లలో వేసి ప్రదర్శనమునకు పెంచితిని. ఈ చెట్లను పెంచుట అంత సులభమైన కార్యము కాదు. మంచియెరువు, శుశ్రూష కావలయును. ఈ చెట్టు సుమారు 4, 5 అడుగుల యెత్తువరకు పెరుగును. పువ్వు వెడల్పు 5, 6 అంగుళముల వరకు యుండును. అనేక రంగులతో పూయును. పూచినపువ్వు బంతిపూవువలె యుండును. ఇది నిర్గంధ కుసుమము. ఇంకను వాకిటి ముందర జినియా, కాస్ మాస్, కలియోప్సిస్, పిటోనియా, స్టాక్సు అను పలువిధములయిన పరదేశపు పూలజాతుల నుంచితిని. బంగళాచుట్టు యుండు కిటికీలవద్ద రాత్రిరాణి (Night-Queen) మల్లె, మొల్ల, జాజి మొదలగు సుగంధపుప్ప జాతులను వేసి పెంచితిని. రాత్రిళ్లు యీ పూలు వికసించి యిల్లంతయు అత్తరుబుడ్డు విరిగిపోయినట్టుగ వాసన విసురును.ఇంటి యిరుప్రక్కలను మాలతి, మాధవి లతాగృహములను నిర్మించితిని.
ఇంటి వెనుక భాగమున ఆస్ట్రేలియా జాతి ఆపిల్ పండ్లచెట్లను, అంజూర (Figs) పండ్లచెట్టును, అలహాబాదు జామపండ్ల చెట్లను, మేలయిన బొప్పాయి మొదలగు ఫల వృక్షములను వేసితిని. అవి కాచి ఫలములు పక్వమునకు రాగానే రాత్రిళ్ళు తోటలో చిలుకలు, పక్షులు