Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు135

కేరళోత్పత్తికి మూలపురుషుడు పరశురాముడని వ్రాసియుంటిని. గనుక ఈ దేశమునకు పరశురామ క్షేత్రమనిన్నీ భార్గవక్షేత్రమనిన్నీ పేరు గలదు. పరశురాముడు ఉమామహేశ్వర్ల ఉపాసకుడు. పరమభక్తుడు. తాను సృష్టించిన కేరళరాజ్యము దుర్మార్గుల పాలు గాకుండుటకు పార్వతీ పరమేశ్వర్లను కాపలా కాయుటకు ప్రార్థించెను. అందుకు వారు సమ్మతించిరి.

ఈ పరశురామ క్షేత్రము గోకర్ణము మొదలు కన్యాకుమారి వరకు వ్యాపించి యున్నది. గోకర్ణమునందు శివుడును కన్యాకుమారియందు శక్తియగు కన్యాకుమారియను కాపలా కాయుచున్నారు. కేరళదేశము పరాశక్తి స్వాధీనమందున్నందున ఈ దేశమంతయు శక్తియుతమైయున్నది. శక్తి అనగ అధికారము అని కూడ అర్థము. నవశక్తులలోను కుమారి బ్రహ్మచారిణి అగుటవలన సర్వశక్తులను సంపూర్ణముగ సమన్వయించుకొనిన నిర్వాణి. నిరంజని. ఎక్కడ సౌందర్యము, సాహసము ఆకర్షనీయముగ నుండునో అక్కడనే అధికారము కూడియుండును. 'శివశక్త్యా యుక్త ప్రభవతి' అను శంకరుని వచనము.

శక్తిలేని శివుడు అశక్తుడు; శివుడులేని శక్తి మారణశక్తి. గనుక పార్వతీ పరమేశ్వరుల సమ్మేళనముననే కేరళదేశము మాతృప్రభ ప్రజ్వలించుచున్నది.

కేరళ రాజ్యమున మాతృపూజ ప్రతియింటను గ్రామమునను జరుగుచుండును. కాళీ, మహాకాళీ, భద్రకాళీ, కాత్యాయిని, మహేశ్వరి, గౌరీ అను నామములతో గ్రామదేవతలున్నారు. ప్రతియింటను లక్ష్మీ, పార్వతి, సరస్వతి, మాధవి అను పేర్లు గలవు. ఈ ప్రకారము దేశమంతయును శక్తియుతమైన ప్రభావమును గల్గియున్నది. నవరాత్రములయందు కన్యకాపూజ సాగుచున్నది - ఆ 9 రోజులున్నూ, వారు కన్యకలకు