Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు107

విశాలమైన తోటలో నివసించుటకు చలవరాళ్లు పరుపబడిన మంచి బంగళాను, ఔషధములను తయారు చేయుటకు అనుకూలమైన కట్టడమును, వనమూలికలను దెచ్చి శుభ్రపరచి సారహీనము కాకుండ భద్రపరచుటకు తగువైన స్థలమును ఆఫీసుకు, అతిథులకు ప్రత్యేకమైన గృహములును నిర్మించబడినవి.

ఈ వూరి ఆయుర్వేద వైద్యులు ఇంగ్లీషు డాక్టర్లవలె రోగులకు కావలసిన మందులకు జాపితా (Prescription) వ్రాసి యిచ్చెదరు. రోగులే అంగళ్లకు పోయి జాపితా ప్రకారము మూలికలను దెచ్చుకొని, మందులను వారే తయారుచేసుకొని సేవించెదరు. ఈ కారణమువలన ఈ వూరి వారందరును సామాన్యముగ ఔషధములను చక్కగ తయారుచేయు అనుభవము గలిగియున్నారు.

తిరుచూరు మధ్యలో గొప్ప శివాలయము గలదు. ఈ స్వామిపేరు వడకనాధన్. ఇది పరశురాముల ప్రతిష్ఠ ఈ ఆలయములోని శివలింగము పైకి కనుపడదు. ఈ లింగమునకు ప్రతిదినము నెయ్యిని అభిషేకమును చేయుటవలన పేరిన నెయ్యి లింగాకారముగ సుమారు 10, 12 అడుగుల పొడవుగ కనుపించును. ఈ లింగము వేసవికాలములో కూడ కరుగక పోయినను నెయ్యిభారమువలన అప్పడప్పడు విరిగి కూలుచుండును. ఈ విరిగిన నెయ్యి చర్మవ్యాధులకు మంచిమందని కొందరు కొనుక్కొని పోవుదురు.

ఈ దేవాలయములోని అర్చకులు చక్కగ చదువుకున్న సంబూదిరి బ్రాహ్మణులు; మంత్ర శాస్త్రవేత్తలు, సంస్కృత పండితులు, బ్రహ్మచారులు. వీరు పొరపాటున యెప్పడైన స్త్రీలను చూచుట తటస్థించునేమోయని వీళ్లకు ప్రత్యేకముగ దేవాలయ ఆవరణములోనే ఇంటిని గట్టించి ఇంటిచుట్టూ