104 చిన్ననాటి ముచ్చట్లు
ఆమె వితంతువు; బిడ్డలు లేరు. నా యింటనే బిడ్డలను కనిపెట్టుకొని యున్నది.
కొచ్చిరాజ్యము కేరళదేశములో నొక స్వతంత్రరాజ్యముగ నుండెను. ఈ రాజ్యమునుచూచి ఉప్పొంగని వారుండరు. దేశమంతయు ఉద్యానవనముగ కాన్పించును. ఇది పడమటి సముద్రతీరమున నున్నది. పడమటి కనుమలు ఈ రాజ్యమును అనుసరించి బారులు తీరియుండును. కొచ్చిరాజ్యము కొండలతోను అడవులతోను కూడియున్నది. భూమి చాలభాగము గుంటుమిట్టలతో నుండుటవలన పంటలకు ముఖ్యముగ వర్షమే ఆధారము. ఈ రాజ్యమున వర్షకాలము యేడుమాసములయినను ముఖ్యముగ జూన్ జులై మాసములు యెడతెగక రాత్రింబవలు కుంభవర్షము కురియును. ఇక్కడ వర్షాకాలము ఎండాకాలములేగాని శీతకాలము లేదు. జోరున వర్షము కురియనప్పుడుకూడ వుక్కపోయుచుండును. దినమునకు రెండు పర్యాయములైనను గుంటలలో స్నానమును చేయకుండ నుండలేరు.
కేరళ స్త్రీలు వివాహమాడవలయునని నిర్భందము లేదు. అనేక యిండ్లలో బ్రహ్మచారిణులున్నారు. సన్యాసినులున్నారు; వేదాంతవేత్త లున్నారు; కేరళ దేశవాసులు శాక్తేయులు. స్త్రీలు విభూతి, కుంకుమలను ధరించుకొనెదరు. ఉమా, కాత్యాయిని, పార్వతి, శారద, మాధవి మొదలగు పేర్లను పెట్టుకొనెదరు. ఈ దేశమున శక్తి ఆలయములు మెండు. పునర్వివాహము సర్వసామాన్యము. విడాకులు అమిత సులభము. ఈ దేశమున నంబూదిరి బ్రాహ్మణులకు మంచి పలుకుబడి గలదు.
తిరుచూరు కొచ్చిరాజ్యమునకు చేరిన మంచి వాసయోగ్యమైన పట్టణము. కొచ్చిరాజ్యమున కెల్ల ఈ వూరి బావుల జలము మంచి