పుట:China japan.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

చీనా-జపాను

సంప్రతింపులవల్ల చైనా స్వాతంత్ర్యమునకు కొన్ని కట్టుదిట్టాలు సైనిక, రక్షణశాఖలలో ఏర్పాట్లు చేసుకొనగలిగిరి. డా||సన్నియేటుసేను 1925 మార్చిలో చనిపోయెను.దానివల్ల చైనాలో మరల ఐకమత్యము చెడిపోయెను. దీనివల్ల పెకింగునందున్న అధికారుల ప్రాబల్యం వలన నాన్కింగు ప్రదేశము 1927 ఏప్రియలులో నాన్కింగు ప్రభుత్వమునకు ప్రధాన పట్టణముగ ఏర్పడెను.సోవియట్టులకు కౌఇంగుటాంగు ముఖ్యప్రదేశము.ఇదే సన్నియ ట్టు సేనునకు కూడా కాంటన్‌ గవర్నమెంటునకు ముఖ్యస్థానముగ నుండెను.1927 లో నాన్కింగు ప్రభుత్వ ము అనగా చాంగిషేకు అనువాడు డా.సన్‌యట్టుసేను మరదలను వివాహం చేసుకొనెను.డా||సన్‌ యట్టు సేనుకు తన భావమరిదికి మంత్రిత్వమిచ్చెను.ఈరీతి సంబంధంతో డా||సన్‌యట్టుసేను అనుచరులలో విభేదం కలిగించి చాంగిషేకు తన నాన్కింగు ప్రభుత్వాన్ని పెద్దదిగా చేసుకొనెను.ఈతడు వర్తకులకు భూస్వాములకు రక్షణకర్తగానుండి కార్మిక కర్షకుల ప్రాబల్యాన్ని అణచుచుండెను. ఈ కారణం వల్ల యిాతని ప్రభుత్వాన్నే విదేశీయ ప్రభుత్వాలు అంగీకరించి బ్రిటను, బెల్జియం, అమెరికా, సంయుక్తరాష్ట్రాలు మున్నగు రాజ్యాలవారు యిా నాన్కింగు ప్రభుత్వంతో వర్తకపు టొడంబడికలు వగైరాలు చేసుకొన్నారు.లీగ్‌ ఆఫ్‌ నేషన్సునకు యిా నాన్కింగు ప్రభుత్వమే ప్రతినిధులను పంపుచుండెను.