పుట:China japan.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1 వ అనుబంధము

73

కీయ సమస్యలను బలహీనంగా చేసి, బ్రిటిషు అధికారాన్ని హెచ్చుచేసుకున్నారు.బ్రిటిషువారు వైనావారిని వారి విశ్రాంతి స్థలములలోనికి(పార్క్సు)క్లబ్బులలోనికి రానియ్యలేదు.చైనావారు బ్రిటిషువారికి బానిసలే అనునట్లు సాంఘికంగా జూచేవారు.ఇండియాకు మొదట వర్తకానికివచ్చి క్రమేణా రాజ్యాన్ని సంపాదించినట్లే చైనాలోనికీ యీ బ్రిటిషువారు ప్రవేశించిరి.డాక్టరు సన్‌యట్టు సేను నాయకత్వంలో 1911 లో చైనా ప్రజాస్వామిక ప్రభుత్వ ముగా ఏర్పడెను. దీనికికాంటన్‌ ప్రదేశము ముఖ్యస్థావరముగ నుండెను.మహాసంగ్రామ సమయంలో(1614-18)జపానువారు పెకింగులోనున్న అధికారులను బెదరించి కొన్నిహక్కులను చైనాలో సంపాదించుకొనిరి. 1921 లో డాక్టరు సన్‌యెట్టుసేను అమెరికా, బ్రిటను దేశములనుంచి చైనాను జపాను మ్రింగకుండానుండుటకు సహా యము పొంందుటకు యత్నించగా అయత్నంలో విఫలమయ్యెను.అపుడు లెనినుతో సంప్రతించగా యిావుభ యుల సంప్రతింపులలోను చైనాపూర్తిగా సోవియట్టు రష్యాను అనుకరించ వీలులేదనియు కాని ఆ పద్ధతులనే చైనాయొక్క సాంఘిక, ఆర్థిక పరిస్థితులనుబట్టి మార్చుకుంటూ అవలంబించుటకున్ను ఏర్పాట్లు జరిగెను.దీనితో డా||సన్‌యట్టుసేనును పాశ్చాత్యులు నమ్మలేదు.జపానుకు సోవియట్టుతత్వంయిష్టంలేదు;గాన మరింత విరోధం హెచ్చెను.కాని చైనాలో ఈవుభయుల