పుట:China japan.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

చీనా-జపాను


మును కాపాడుటలో లీగ్‌ఆఫ్‌ నేషన్సు(అంతర్జాతీయ సంఘం)యిదివరలో సహాయపడలేదు.అందువల్ల లీగ్‌పై చైనాకు మోజు పోయింది.ఇంతకూ నాన్కింగు, కాంటన్‌, సోవియట్టు ప్రభుత్వాలు మూడు ఏకమైతే ఏకొద్దో జపానుయొక్క సైనికబలాన్ని అడ్దుకొనగలదేమోగాని అటుల లేనంతవరలు చైనా జపానుకు లొంగక తప్పదేమో అనిపిస్తోంది.

ఇంతకు వైనాలో పాశ్చాత్యులలో బ్రిటిషు, అమెరికా, ఫ్రెంఛి వారికిన్ని తూర్పుననున్న జపాను అధికారానికి హక్కులున్నాయి.ఈ నాలుగు అధికారముల మధ్యను చైనా స్వాతంత్ర్యంగా నుండడానికి నలిగిపోతోంది.

♦♦♦చైనా బలహీనత-నాన్కింగు గవర్నమెంటు♦♦♦

1644 లగాయితు 1911 వరకు చైనాలో సరియైన ప్రభుత్వంలేక(కేంద్ర ప్రభుత్వం) ఎవరు బలవంతులో అట్టి వారి అధికారంలో తలోకాస్తా వుంటూవుండేది.ఇందువల్లనే బ్రిటిషువారు 1842 లో చైనాకు నల్లమందు వర్తకం చేయుటకు వచ్చి చైనారాజులతో పోరాడి వర్తకానికి హక్కులను సంపాదించుకొనిరి.చైనావారు నల్లమందు వేస్తా రు.అందువల్ల చైనావారికి బ్రిటిషువరు నల్లమందునమ్మి లాభాలు సపాదించుటకు ప్రారంభంలో వచ్చి క్రమేణా చైనాలోనున్న ముడిపదార్థాలను బ్రిటిషువారు తీసుకుపోవుటకు రైళ్ళు,బ్యాంకులు మున్నగు వాటికి బ్రిటిషువారే పెట్టుబడిపెట్టి ఆరీతిగ చైనా ఆర్థిక రాజ