పుట:China japan.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


75
1వ అనుబంధము

చైనాలోని మిగతా కాంటన్,కౌఇంగుటాంగు ప్రభుత్వాలకు అనగా డా||సన్‌యట్టు అనుచరుల ప్రభుత్వానికి, కౌఇంగుటాంగు సోవియట్టు అనుచరుల ప్రభుత్వానికి యిా నాన్కింగు ప్రభుత్వం లోబడదు.అందువల్ల యిారెంటి ని అణచుటకు నాన్కింగు ప్రభుత్వము ధ్వజం ఎత్తుతో ఉండడంవల్ల అంతంఃకలహములున్నాయి.నాన్కింగు ప్రభుత్వాన్ని ఎదుర్కొనుటకు నాన్కింగు, కౌఇంగుటాంగు ప్రభుత్వాలు రెండున్ను 1931 లో ఏకమై యత్నించ గా ఆయత్నంలో కొంత సఫలం కొంత విఫలం కలిగినది. చైనాలో హుఫే రాష్ట్రములోను,హనన్‌ రాష్టంలో చాల చోట్లలోను సోవియట్టు ప్రభుత్వం చాలా కట్టు దిట్టాలతో ఏర్పడి అభివృద్ధి మార్గంలోనే ఉంది.ఈ భాగాల సరి హద్దులలో“ఇక్కడ నుంచే చైనా సోవియట్టు గవర్నమెంటు ప్రారంభం” అనుగుర్తుగల సైనుబోర్డులను (వ్రాత మూలకంగా తెలిపే చిహ్నములను)కట్టుకొన్నారు.నాన్కింగు ప్రభుత్వంలో నున్నవారిలో కొద్దిమంది కూడిన పక్షం సోవియట్టునకు హెచ్చుమందితో కూడిన పక్షం నాన్కింగు ప్రభుత్వంతోటి సంబంధం పెట్టుకుంది.మొత్తానికి యిా కాంటన్‌ ప్రభుత్వం నాన్కింగు ప్రభుత్వంతో స్నేహంగా వుంటూ ఒకరికి మరొకరు తోడ్పడుతున్నారు.

నాన్కింగు, కాంటన్‌ గవర్నమెంటులు ఒకటే అనుకుందాము.ఈవుభయులు ఏకమై ప్రభుత్వంలో వృద్ధనాయ