పుట:China japan.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

చీనా-జపాను

పోయెను. ఇదియంతయు, 1936 ఫిబ్రవరి 26 వ తేదిని జరిగినది.వీరు టోకియో ఆయువుపట్టుల నన్నింటిని మూడుదినములు స్వాధీనమునందుంచుకొనిరి.తరువాత ప్రభుత్వమునకు లొంగిపోయినను, వీరి షరతుల నన్నింటిని క్రొత్త ప్రధాని అంగీకరించిన తరువాతనే క్రొత్త క్యాబినెట్టు యేర్పడినది.జపాను ప్రభుత్వము వరుస ఈరీతిని ఉండును.

ఇవిగాక కొన్ని సక్రమాభివృద్ధి సంఘములు లేకపోలేదుకాని ఇవిలేచిన వెంటనే అణగ ద్రొక్కబడుచున్నవి. సేనుకాటయామా 1897 లో రైల్వే లేబరుయూనియనును స్థాపించి ఒకగొప్ప సమ్మెకట్టు నడిపించెను గాని 1900లో ట్రేడు యూనియను లెచ్చటను ఉండారాదని ఒక పోలిసు చట్టము ప్యాసు చేయబడెను.1912 లో టోకియా ట్రాము పనివారలు, గనుల పనివారలు, ఓడలపనివారలు, అచ్చాఫీసు పనివారలు, పడవప పని వారలు సమ్మెలుకట్టి కొంత విజయము నందిరి.1918 లో వ్యవసాయపు పనివారలు కూడా తిరగబడిరి.ఈ విధముగా ప్రజాఉద్యమములు కూడా జపానులో చెలరేగు చున్నవి.కాని గవర్నమెంటువారి చర్యలవల్లను, కుడి యెడమపక్షనాయకుల భేదాభిప్రాయముల వల్లను ఇవి బలవంతము కాజాలకున్నవి.అయినను 1932 జపాను ట్రేడు యూనియను కాంగ్రసు లెక్కెల ప్రకారము చూచిన యెడల నూటికి 79 గురు కార్మిక సంఘములవారు కాంగ్రెసులో నున్నట్లే తెలియుచున్నది.అయినను జపాను కార్మికులలో