పుట:China japan.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

ఈ కారణము వలన జపాను జాతీయతా సంఘట్టనకు, గౌరవభంగమునకు, సైన్యవిజృంభణమునకు, ఆశా పోషణమునకు భంగకరమైనట్లు అనుమానము కలిగించిన యెందరో ధీమంతులు, రాజకీయవేత్తలు, కమ్యూని ష్టులు, చివరకు సేనానులుకూడ రహస్యముగ వధించబడిరన్న ఆశ్చర్యమేమి! వాషింగ్టను ఒడంబడిక వీరి కిష్టము లేదు గనుక హారా అనునతడు వధించబడెను.లండను నేవల్‌ కాన్ఫరెన్సు తీర్మానము వీరి కిష్టము లేదుకనుక హామాగూచీయనునతడు వధించబడెను.జాతిసమితితో స్నేహముగానుండి లొంగిపోవుచున్నారను అనుమానముచే ఇనూకాయ్‌మినోయే అనువారలు వధింపబడిరి.మంచూకోలో యుద్ధపన్నాగము లేమిా వద్దని జనరల్‌ నాగాటా అనాడట.ఇందువల్ల లెప్టినెంటు కర్నలు అయిజవా అతనిని వధించెను.ఈ కర్నలును విచా రణకు తెచ్చిరి.ఈవిచారణకు వామపక్షము వారందరూ ఇష్టముగా ఉండిరి.దక్షిణపక్షము వారికిది యిష్టము లేదు.అయినను వామపక్షము లేక యెడమపక్షము గనకే యెన్నికలలో విజయమువచ్చి వారి క్యాబినెట్టు స్థాపించబడినది.దక్షిణపక్షము లేక కుడుపక్షము వారును వారికి చెందిన యువక ఉద్యోగ సంఘము వారును, రక్తసమితి(లీగు ఆఫ్‌ బ్లడ్)వారును రహస్యముగా కుట్రలు పన్ని ఈ క్యాబినెట్టులోని ముగ్గురను వధించిరి. ఒకనికి అపాయకరమగు గాయముచేసిరి, ప్రధానియగు ఓకాడాయనుకొని అతని బావమరదిని చంపివేసిరి;గనుక ఓకడా మాత్రము మిగిలి