పుట:China japan.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

చీనా

లును జపానులో దూరి ఇట్టిపత్రములు వ్రాయించుకొనెను.జపానులో పాశ్చత్యవస్తువులు వర్తకము ప్రబలజొచ్చెను. జపానుకు మిగిలిన దెల్లయు జపాను జాతీయభావమే.

అంతకుముందు జపానులో అనేక సేనా నాయకులు ఒక్కొక్కభాగమున కొక్కొక్కడధిపతియై ఒకరినొకరు నరకు కొనుచుండిరి.కేంద్రప్రభుత్వమగు పోగను వంశీయులు నామకః మాత్రమే ఉండిరి. మికడో అను బిరుదముగల ఆరాజునకు జపానునాయకులపై నెట్టిచర్యలను గాని తీసుకొనుటకు సాధ్యము కాకుండెను.అయినను అతను పవిత్రమూర్తిగా మాత్రము భావింపబడుచుండెను.కామోడోరుపెర్రీ చర్యల తరువాతను జపానులో ఒక అపూర్వ చైతన్యముదయించెను.మికాడోకు తిరిగీ పూర్ణాధికార మిాయబడెను.అతని జండాక్రింద నిలబడి విదేశీ ప్రభుత్వ ముల నెదురుకొనుటకు తక్కిన నాయకులెల్లరును నడుము కట్టుకొనిరి.దీనినే మొయిజీ శకము అందురు.ఇది 1865 తో ప్రారంభమాయెను.రాచరికముతో పాటు పాశ్చాత్యప్రాతినిధ్య రాజ్యాంగక్రమము కూడ ప్రతిష్ఠించబడెను. ఇప్పటి నుండియే జపానులో పారిశ్రామికవిప్లవము కూడా ప్రారంభమై దినదినాభివృద్ధి పొందజొచ్చెను.

పారిశ్రామికాభివృద్ధితో పాటు కార్మికుల కష్టములు కూడ పెరిగెను.పాశ్చాత్యదేశముల శుశ్రూషచేసి పరిశ్రామిక నైపుణ్యమును చేపట్టి ఉత్పత్తి నెక్కువచేసెనే గాని, ఈ ఉత్పత్తి కార్మికుల నెక్కువ కష్టపెట్టి తక్కువ కూలులిచ్చి