పుట:China japan.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చీనా

శాంతి అక్కరలేదని ప్రకటించినట్లు 1937 జూలై 19 వ తేది కూలింగు నగరమునుండి వచ్చిన వార్తలవలన తెలియుచున్నది.చీనానుండి ఒక్కముక్కయైనను చీలిపోవుట అతనికిష్టము లేనట్లు తెలిపినాడు.చీనా జాతీయత నశించకుండుటకై అతను సర్వవిధములను తాపత్రయము పడుచున్నాడు.చీనాలో యేభాగమునకుగాని అబిస్సీనియాకు పట్టినగతి పట్టకూడదని అతను భీష్మించియున్నాడు.లూకోచియావో నగరములో జపానువారు తమ సేనలు నింపినను చీనాసేనకు కూడా అక్కడ కిక్కిరిసియే యున్నవి.జపానుకు సంపూర్ణముగా గెలుపాశ లేనందువల్లనే శాంతిరాయబారములుకూడ నడుపుచుండుటకు కారణమని మనము ఉహించవచ్చును.జపాను యేదో సాకుపైని ఉత్తరచీనాలో యుద్ధమును ప్రకటించినను రాయబారముల మాట మరువకున్నది,చీనాకూడా జపాను రాయబారములను తృణీకరించుచు యద్ధమునకు సంసిద్ధముగ నున్నట్లే ప్రకటించుచున్నది. ఫలితంమెట్లుండునో చూడవలసియున్నది.

§§§§§
33