పుట:China japan.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

చీనా-జపాను

సంరక్షణా సంఘములు శాఖోపశాఖలతో వెలయుచున్నవి.సామ్రాజ్య ప్రతికూల ప్రదర్శనములు కేకలు చెలరేగు చున్నవి.విద్యార్థులందరును వీరికి పట్టుకొమ్మలై ప్రబోధమును రేకెత్తించుచున్నారు.నాంకింగు ప్రభుత్వము చేసిన దేశద్రోహచర్యలను ప్రకటించి ప్రజాపరిపాలక సంస్థల నిర్మించుచున్నారు.

ఈవిధముగా ఒకప్రక్కను విదేశీ సామ్రాజ్యముల మీదను, వేరొక ప్రక్కను దేశద్రోహులమీదను ద్వేషము పెచ్చుపెరుగుచున్నది.సోవియట్టుతత్వ మొకప్రక్కను యెఱ్ఱసేనలు వేరొక ప్రక్కను వర్థిల్లుచున్నవి.క్రమక్రమముగా నాంన్కింగు ప్రభుత్వముయొక్క పలుకుబడి క్షీణించుచున్నది.నాంకింగు ప్రభుత్వమునకు ప్రస్తుతము నేతగను సర్వాధికారిగను ఉన్న చియాంగుకాయ్‌షేకు జపాను పక్షపాతముతో వర్తించుచున్నాడన కారణమున ఇతరపక్ష నాయకుడు చాంగుహుగ్సాలియాంగు అతనిని అరెస్టుచేసి నెలదినముల వరకు విడువలేదనిన, నాంకింగు ప్రభుత్వము పలుకుబడి యెంతవరకు తగ్గినదో విశదము కాగలదు.చియాంగుకాయ్‌షేకు తనకు జపాను పక్షపాతమేమియును లేదనియు, జపానుతో తీవ్రవిరోధము సాగింతుననియు వాగ్దానము చేసినపైని అతనిని విడుదలచేసి తిరిగీ అధికారస్థానమున నిలబెట్టిరి.నేటికిని అతనే చీనా ప్రభుత్వమునకు అధికారి.అతను కూడా జపానుతో రగిడీ పెట్టుకోకుండా శాంతిని స్నేహమును వాంఛించుచున్నను చైనా హక్కులకేమాత్రమైన భంగము కలిగెడి