పుట:China japan.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చీనా

(ౠ)మంచూకోను గురించి లిట్టను కమిటీవారు తయారుచేసిన నివేదికను ప్రతిఘతించి, సోవియటు రష్యా ప్రభుత్వముతో కలసి యుండుట కేర్పాటు చేయుట.

(ఌ)చీనాజాతిని శత్రువులకు ఒప్పచెప్పి జాతీయ కళంకమునకు కారణమైన క్యూమింగుటాంగును, నాంకింగు ప్రభుత్వమును కూలద్రోయుట.

(ౡ)చీనా ఈశాన్య భాగము లందున్నట్టియు జపానుచే ఆక్రమింపబడినట్టియు ప్రదేశములను స్వాధీనము చేసుకొనుట, ఇతర విదేశ సామ్రాజ్య ప్రభుత్వములు ఇట్టి ఆక్రమణములు చేయకుండా చీనాను సంరక్షించుట.

(ఎ)జపాను సామ్రాజ్యమున్ను ఇతర సామ్రాజ్యపూంచీదారీ సంఘములున్నుచేరి పీల్చిపిప్పిచేయుచున్న కొరియా మాంగోలియా ప్రజలతో సన్నిహిత స్నేహరీతిని వర్తించుట.

(ఏ)ప్రపంచము నందంతటను ఉన్న కార్మిక వర్గముతో సన్నిహిత సంబంధము నేర్పరచుకొని వారందరికిని పరమశత్రువగు సామ్రాజ్యతత్వమును యెదుర్కొనుట.

(ఐ)ప్రజల విప్లవసేనను నిర్మించినాయకత్వము వహించుచున్న చీనా కమ్యూనిష్టు పార్టీకి సర్వవిధములను సహాయముచేయుట.

(2)చీనా గ్రామములందెల్ల జపాను సామ్రాజ్యప్రతికూల సంఘములు,ఇతర విదేశ సామ్రాజ్య తత్వప్రతికూల సంఘములు,ఇతర విదేశీ సామ్రాజ్య తత్వప్రతికూల సంఘములు,ఈవిధమైన ప్రపంచసంఘముల శాఖలు, స్వకీయ

31