పుట:China japan.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

చీనా-జపాను

మరణించిరి.లక్షమందికి గాయములు తగిలి కాళ్ళు చేతులు విరిగినవి;12 వేలమంది ఖైదీలయిరి.కాని యెఱ్ఱ సేన 2లక్షలనుండి 2,60,000 కు పెరిగినది.

ఈయుద్ధమింతటితో ఆగలేదు.విప్లవపక్షమునకు సేనలయొక్క ఆవశ్యకతయు ప్రాధాన్యమును బాగా తెలిసినది.చీనా సోవియటు సేనల హెచ్చించి మంచిశిక్షణము నిప్పించుటయందే తమ శ్రద్ధనంతటిని వారు కేంద్రికరించిరి.సేనల బాగుపరచిన తరువాత రివల్యూషనరీ మిలిటరీకౌన్సిలువారి సలహా ప్రకారము వారు మధ్యజిల్లాయగు కియాంగ్సీని విడచిపెట్టి పశ్చిమ ప్రాంతములలో జొరబడిరి.1934 అక్టోబరులో వీరు చియాంగుకెయిషేకు యొక్క 8 లక్షల సేనలమధ్యనుండి యుద్ధము చేయుచు దూరుకొనిపోయి 1935 జనవరి నాటికి క్వాంగ్సీరాష్ట్రమునందలి క్వెయిలిన్ నగరమును చేరిరి.అక్కడున్న క్యూమింగుటాంగు సేనల నోడించిరి.క్వెయిచొ రాష్ట్రమునందలి క్వెయిటింగు నగరమునుదాటి ఫిబ్రవరి మధ్యభాగమునాటికి స్వెషాను ప్రాంతమును ముట్టడించిరి.ఏప్రిల్‌ వరకు వారెన్నో యుద్ధములొనరించుచుండిరి.దీనితో చియాంగుకెయిషేకు యొక్క 8 వ దళముకూడా ఓడిపోయినది.వాంగుకాయిలే అను మరియొక సేనానియొక్క అసంఖ్యాక దళములు ఓడిపోయినవి.

పిమ్మట యెఱ్ఱసేనలు యున్నాను రాష్ట్రములో ప్రవేశించి అక్కద సోవియట్టు సభలనేర్పాటు చేసెను.తరువాత షెచ్వాను