పుట:China japan.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


స్టేలిను యొక్కయు అభిప్రాయమైయుండెను.ఈ కారణముల వల్ల చీనా విప్లవ నాయకులు లేక క్యూమింగు టాంగు వామపక్ష నాయకులగు వాంగుచిన్‌వెయి మొదలగువారు దక్షిణపక్షముతో గట్టిగా పోరాడలేదు సరేగదా దానికి ప్రతికూలముగ కొందరు భూస్వాములలోను పూంజీదారులలోను దూరిపోయిరి.ఇట్టి చర్యలు మాత్రము అవకతవకవే యైనను ఈసమయమున మోటాయించి కర్షకశ్రేణిని విసర్జించుట సరియైన మార్గము కాదని అందరును ఒప్పుకొనుచున్నారు.

వూహానులో కమ్యూనిష్టు ప్రభుత్వము

చియాంగ్‌ కాయ్‌షేకు నాంకింగులో బూర్జువా ప్రభుత్వమును స్థాపించినను అది బలవత్తరముగా లేకుండెను. క్వాంగుటాంగు,షాంఘే జిల్లాలలోని కర్షక కర్మిక సంఘముల నణగత్రొక్కుటయే అతడు తన మొట్టమొదటి పనిగాబూనెను.

కర్షక కార్మిక సంఘముల యెడల నాతడవలంబించిన ఇట్టి ఘోరచర్యలు వారిద్వేషమును మఱింత బలపర చెను. వీరును విద్యార్థిసంఘములును కలసి వూహాన్‌ నగరమునందు 1927లో మరియొక ప్రభుత్వమును నెలకొల్పిరి.ఈప్రభుత్వము స్థాపించబడినప్పటి నుండియు కర్షకసంఘములు మరింత బలపడినవి. హూనాన్‌, హూపే జిల్లా కర్షకసంఘములో నున్న 800,000 సభ్యులసంఖ్య మే మాసము నాటికి,

11