పుట:China japan.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

చీనా-జపాను

యేలాగనూఉన్నది.క్యూమింటాంగులో దక్షిణభాగము వారు జాతీయశాంతివాదులు;వామభాగమువారు విప్లవ వాదులు.దక్షిణ పక్షసహాయముతో వామపక్షమువారిని,కమ్యూనిష్టులను కూడా చాంగుకెయ్‌షేకు అణగ ద్రోక్కి సంపూర్ణ జాతీయపక్ష ప్రభుత్వమును నెలకొల్పబూనెను.1926 మే మాసములో అతడు కొంతవరకు విజయ ము నందెను.క్వాన్టంగు,షాంఘే జిల్లాలలో కార్మికుల బలము నాశనము చేయబడెను.నాన్‌కింగులోజాతీయ ప్రభుత్వము నెలకొల్పఁబడెను.

దక్షిణపక్షము యొక్క విజయమునకు కమ్యూనిష్టు పార్టీవారి కొన్ని చర్యలే కారణములు.ఆచర్యలను వార ప్పుడు అవలంబించవచ్చునా కూడదా అన్నది కొంతవరకు సందేహాస్పదమే.విప్లవమును నాలుగు గుఱ్ఱాలూ పూన్చి పరిగెత్తించుట ఆ సమయమున నీతివంతమగు కార్యంకాదు.అది ట్రాట్‌స్కీ సిద్ధాంతముల చొప్పున సవ్య మైనట్లు కనిపించినను స్టేలిను సిద్ధాంతముల ప్రకారము అపసవ్యమైనదే.ఈపరిస్థితులలో చీనా కార్మికులు చీనా జాతీయోద్యమమును పూర్తిగా విసర్జించుటకు వీలులేకుండెను. క్యూమింటాంగును వారు పూర్తిగా విసర్జించిరేని కర్షకబృందము వారి ప్రక్కన నిలువదని వారికి అధైర్యము కలిగెను.కర్షకులలో కూడ విప్లవ భావములు పూర్తి గా చెలరేగనిదే జాతీయేద్యమమును తూలనాడుట మంచిమార్గము కాదని కమ్యూనిష్టు ఇంటర్నేషనలు యొక్కయు,