పుట:China japan.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

చీనా-జపాను

2,000,000,లకు పెరిగినది.ఈ రెండుమాసములలోనే హూనాను జిల్లా కర్షక సంఘసభ్యుల సంఖ్య 5,000,000 లకు పెరిగినది.

ఈసంఘముల సభ్యులసంఖ్య పెరుగుటయే కాక వీరి చర్యలుకూడ విప్ల వమార్గములు పట్టినవి. అనేక గ్రామములలోను నగరములలోను క్యూమిటాంగు ప్రభుత్వపుటాజ్ఞలు ధిక్కరించబడినవి.భూస్వాముల భూము లను సాహుకార్లసంపదను వీరు స్వాధీనము చేసుకొని తమకుటుంబములలో పంచుకొనిరి.పెద్ద కుటుంబముల వారికి పెద్దవంతు,చిన్నకుటుంబము వారికి చిన్నవంతు, ఈ రీతిగా కుటుంబసభ్యులసంఖ్యనుబట్టి పంచుకొనిరి. అనేకమంది భూస్వాములు సాహుకార్లు ఈ అపాయములను గుర్తించి తమ ఆస్తులను తామే వీరికి ఒప్ప చెప్పిరి.అట్లా ఒప్పచెప్పని వారిని వీరు అరెస్టుచేసి శిక్షింప మొదలు పెట్టిరి.పట్టణములలో కార్మికసంఘము లు, ట్రేడుయూనియనులు కూడా ఇట్టి సాహసములే యొనరించినవి.

కాని దిగువ మధ్యతరగతులవారికి,విజ్ఞానసంతతులవారికి,భూస్వాముల పుత్రులకుగూడ ఇట్టిచర్యలు విపరీత ములుగా దోచినవి.వీరుఇంతకుముందు విప్లవోద్యమపోషకులేయైనను ఈకార్యములను చూచి భయపడి జాతీయ పక్షముతో చేతులు కలుపజొచ్చిరి.ఈ సమయముననే విదేశప్రభుత్వములవారు షాంఘేనగరమును ముట్టడించి అక్కడకు ఆహారాది పదార్థములు పోకుండా ఆటంకపెట్టిరి.వూహాను ప్రభుత్వప్రదేశములలోనే ఇట్టిచర్యలవలన ఆర్థికపరిస్థితులు,అకటావి