పుట:Chennapurivelasa018957mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థంబగు పశ్చిమపద్ధతి

41

నిదానంబును విలాసంబులకు విశద లస్యరంగంబును నద్భుతంభులకు నధికలీలా సదనంబును ముఖ్య వస్తు వులకు మూల భవసంబునునగు నమ్మేడ వెడలి మరల నయ్యధికారి యొసగు చీటియా తోటలో వాకిటనున్న మేటి భటునకిచ్చి వానిం గడచి లోనికినడువ నెదుటఁబటుకరొరకాలాయన శలాలికా వికట ఘటితంబై పంజర ప్రాయంబగు నొక్క విశాలమంటపంబునఁ జిక్కి పూటపూటకు నెక్కుడుగాఁబాటించి గాటంబుగ దీటుకొల్పు జింక చివ్వంగి గొఱియ మేకలు లోనగు వాని మాసంబుల గ్రాసంబులు చేకొని మెక్కి పుటపుట నై పొగరొక్కి నిక్కి దిక్కులుచూచుచుం దమ్ముజూచుచున్న జనులుంజూచి యేచియిాసు రేచి తీండ్రించుచు వేండ్రంబుగ గాండ్రన నఱచు చుంగుత్తుకెత్తి వృత్తపింగళ క్రూరనయనాపాంగరంగంబుల నంగారంబులు గురియం గులాలచక్ర భంగికా భంగురంబుగ వ్యాప సవ్యంబుగ దదభ్యంతరంబునంబరిభ్రమించుచు నిబ్బరంబుగ నుబ్బి యబ్బురంబుగ బొబ్బ లిడు బెబ్బులులు రెండు నుదదంతికంబునఁ దాదృగ్విధ మంటపంబునఁదాదృశంబుగ సంక్షోభించు తరక్షు ద్వయంబును మఱియొక్క చక్కిశాలాస్తంభని బద్ధంబులగు ఋష్య గవయంబులును వేఱొక్క యెడంగడు బెడిదంబగు గర్తంబునంబడి వెడల నేరక బడిబడి నెగసి దిగంబడి దిగులువడి వడిదక్కి సుడివడిబడలువడు నుత్ఫుల్ల నిబిడరోమ పటల జటిలంబగుట వికటకంబళ కప౯టకంచుకా వృతంబగు వడువున గనంబడు నతి కఠోర నఖర భల్లంబగు నచ్ఛంభల్లంబును వేఱొక్క తావున విశాల శాలాంత రాళంబున లోహ శృంఖలం