పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/837

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు వట్టి అమాయికులు

941


అనుబంధము

(1) మృగవరాక్షి (2) నడిపించె, 19, 225, 112, (3) మా యొక్కొక్కరి తురీయార్ధంబుదాల్చి, కప్పిరొక్కక్కరు భీష్మునేనిటన్, (4) నాదగుపాణిగ్రహణం బొనర్పన్ నగు, దేవతాచక్రవర్తికి నాచార్యుని యంత వాని సుతుఁడు, నీదు నధరామృతము, నా దుహితృ ప్రాణవిభుండు, (5) చేదిపుర మేగి, నిజపురం బరిగి, (6) వ్యాసు లరుగుదెంచి సలుపు మీకు హితోపదేశము (7) నానిమిత్త భయంబు (8) పన్నుకంచును గొనిరి (9) కాశియుఁబ్రయాగ మొదలుగ (1) అధ్యాత్మనూహించితిన్, సురవర్త్మన్ బిందుపాతస్ఫురణన్.

పైని చూపిన ప్రయోగాలన్నీ గురువుగారి భారతంలోన్నుంచి సంగ్రహింపఁబడ్డాయి. వారు నా ప్రయోగాలు ఆక్షేపించివున్నారు. ఆ ఆక్షేపణలు పైనిచూపిన గురువుల ప్రయోగాలచే వివరిస్తాయి. అందులో 2, 5, 9, అంకెలు పూర్తిగా గురువులు యేవి తప్పన్నారో అవే అనిన్నీ, తక్కిన అంకెలలోవి సజాతీయాలనిన్నీ చదువరులేకాక గురువరులును గమనించాలి. వారు తాము ప్రయోగించివుండిన్నీ నన్ను ఆక్షేపించడమనేది మఱుపుతగలడం చేత అనుకోక తప్పదు. యింతతో గురువులు నన్ను తప్పుపట్టడం మానడం యుక్తం.

యింకొకటి. నీవు నే నాక్షేపించిన యే ఆక్షేపణకు దేన్ని వారకంగా యిచ్చి వున్నావని గురువులు అడిగితే దాన్ని గూర్చి విస్తరించి అప్పుడు ఫలానాదానికి ఫలానాదాన్ని వుదాహరించివున్నానని మనవి చేసుకుంటూవున్నాను. యిప్పుడు విస్తరభయంచేత అందుకు వుపక్రమించలేదు. యితరులకు తెలియదేమోకాని గురువుల ప్రయోగాలు గురువులకు తెలియక పోతాయా? నేనిప్పటికి వారి భారతం యిందు నిమిత్తం పరిశీలించింది ఆదిపర్వ సభాపర్వాలు మాత్రమే. ఆయీ ప్రయోగాలు ఆ పర్వాలలో చూచుకుంటే గురువులవారు తాము ప్రయోగించిన మాట మఱచినన్ను ఆక్షేపించినట్లు స్పష్టపడుతుంది. యితరుల ప్రయోగాలు బోఁలెడు వున్నప్పటికీ నేను గురువుల ప్రయోగాలే చూపడం వాదం సులభంగా తేలుతుందనే హేతువుతప్ప అన్యంకాదు. నామతంలో ఆ ప్రయోగాలన్నీ నిర్దుష్టాలే. గురువులు నన్నాక్షేపించే తోవనుబట్టి చూస్తే అవన్నీ శుద్ధతప్పులే అయితీరతాయి, భగవంతుఁ డవతరించినా లాభం లేదు. తాము ప్రయోగించీకూడా నన్ను ఆక్షేపించడం చూస్తే గురువులు అమాయికు లనుకోవడాన్నే బలపరుస్తుంది.

అయితే నీవు గురువుల భారతం రెండుపర్వాలు ప్రయోగాలకోసం చదివానంటావకదా? అవి నీ ప్రయోగాలవలెనే నిర్దుష్టాలేనా? లేక యెక్కడేనా దుష్టాలున్నాయా? అని కూడా