పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/830

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

934

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వాడుకలోనిది" అంటూ ఆక్షేపించడమే కాకుండా, “యింత తెల్వితక్కువగా" ప్రయోగించే మీరు మాబోట్ల రచనలను గూర్చి లేశమున్నూ "నోరెత్తడానికి” అవకాశం లేదంటూ కొన్ని మాటలు ఖర్చుపెట్టివున్నారు. యింకా కొన్నిటిని యిట్లాటివాటినే స్వామిగారు చూపించి వారికున్న పాండిత్యగర్వాన్ని ప్రకటించివున్నారు. యిప్పుడు వారిది ప్రస్తుతం కాదుకనుక మచ్చుకు వకటిమాత్రం చూపి వూరుకున్నాను. “భారతి"లో వారి విషయం బయలుపడుతుంది. శ్లో. లోకోక్తీనాం భవే ద్యోగో యథావ చ్ఛ్రుతిరంజనమ్. అని అహో బలుఁడు వ్రాసి "అయోలక్క" లోనైనవాటిని వుదాహరించిన వున్నట్లు జ్ఞాపకం. జ్ఞాపక మనడమేమిటి? ధ్రువంగానే వ్రాయరాదా? అంటే, అప్రస్తుతమైన వినండి. యిదివఱలో శతఘ్నులు వగయిరాలను పగులఁగొట్టే రోజుల్లో బందరులో వుండడపు సౌభాగ్యంవల్ల "టవున్‌హాలు"లో కావలసినంత గ్రంథసామగ్రి దొరికేది. యిప్పుడో, పల్లెటూరినివాసం. కాఁబట్టి ఆ సౌకర్యం బొత్తిగా లేదు. ఆయుధసామగ్రి లేకుండానే యుద్ధంచేయాలి. బహుశః అట్టియుద్ధంలోనే జయంపొంది గురువులవల్ల “క్రియాసిద్ధి స్సత్త్వే భవతి మహతాం నోపకరణే" అనే శ్లోకానుసరణంగా సర్టిఫిక్కట్టును సంపాదిద్దామని వుంది.

ఆచార్లుగారు భారతివిశేషాలు చదివిన్నీ అందులో మేము వ్రాసిన "ఈవామనునికన్న ప్రాచీనుడుఁగాన కాళిదాసు" అనే వాక్యాన్ని యెఱిఁగీనిన్నీ నన్ను వెక్కిరిస్తూ యీ మధ్య భారతిలో వ్రాసిన వ్యాసంలో "కాళిదాసేకాలపువాఁడు, వామనాచార్యుడే కాలపువాఁడు" అంటూ బోధించి “ప్రకాస్తి" అనే పదాన్ని “పామరై కప్రయోజ్యమగు గ్రామ్యపదము" అని “ఢంకామీఁద దెబ్బగొట్టి వ్రాయగల్గిన సాహసులు. "ప్రకాస్తి" గ్రామ్యమనడం, యిదివఱలో వెం|| రా||లు. "క్షమాపణ" నింద్య గ్రామ్యమన్న తెగలోకి వస్తుందిగదా. యిఁక “ఢిల్లికి ఢిల్లే" అనే లోకోక్తి అనుకరణంలో కూడా వుంది. పింగళి సూరన్నగారి “రోళ్లా రోఁకళ్లం బాడిన" అనే ప్రయోగం వల్ల అనుకరణం కూడా అక్కఱలేదని తేలుతుంది. దాన్ని బట్టే "తొండరడిప్పొడియాళ్వారి" చరిత్రలో సారంగుమహాకవి "ధాత్రీమండలి పాలువిఱిగితే పెరుగగునే?” అని ప్రయోగించుకున్నాఁడు. అయీ సందర్భాలు లేశమున్నూ తెలియని ఆచార్లగారి తోడ్పాటును గురువులు అఱవైవేల పద్యాలు భారతం తెలుగులో వ్రాసినవారు, పుచ్చుకోవడం ఆశ్చర్యంకాదా? తాము చూపేతప్పులే నిలవడంలేదే! నిలవకేమంటారా? యిదివరలో (1) "స్త్రీలను" యెత్తికొని సప్తమ్యర్థక ద్వితీయ తప్పన్నారు. భారత ముదాహరించి వున్నాను. (2) "కోరికెలు" ఎకారఘటితం తప్పన్నారు. మహాకవి ప్రయోగాలు చూపి వున్నాను (3) “చూపఱులు” తప్పన్నారు. ప్రౌఢ వ్యాకరణము చూడాలన్నాను. యీ సమాధానా లేమైనా నచ్చినట్లేనా? లేక నచ్చనట్లా? నచ్చితే నచ్చాయని చెప్పి మళ్లా తప్పులజాబితా వ్రాయడాని కుపక్రమించవలసిందంటాను. ఆయీ మీ తప్పులజాబితా