పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

925“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది"

(14-5-1936 సం||ర గోలకొండ పత్రిక నుండి)

అంటూ వక సామెతవుంది. ప్రస్తుతం మా గురుశిష్య వాదోపవాదాలు తుట్టతుదకు ఆలా పరిణమించి నట్లయింది. అసలు యీ వాదాలు హైదరాబాదులో హరికథ చెప్పడానికి మా గ్రామప్రాంతాన్నుంచి వెళ్లిన ఆయన చేసిన ప్రసంగంవల్ల కొంతా, ఆప్రసంగరక్షణకు గురువుగారు వ్రాసినవుత్తరం వల్ల కొంతా, ఆ వుత్తరం విమర్శించి అందున్న వ్యత్యాసాలు చూపినవారివల్ల కొంతా పుట్టినట్లు మా వాదోపవాదాలు ఆద్యంతాలు చదివిన వారికి తెలుస్తూనే వున్నాయికనక విస్తరించేదిలేదు. ఆయీ వాదోపవాదాల వల్ల వచ్చే లాభానష్టాలుకాని, కీర్త్యపకీర్తులుగాని మా గురుశిష్యులను పొందడం యుక్తం. యితరులపై పొలవడానికి నేనుగాని గురువుగారు గాని యెంత ప్రయత్నించినప్పటికీ తుట్టతుదకు జరిగేదిమాత్రం అంతే. “గురువుగారు ప్రమాదంవల్లనో అంతకుముందే అంతరంగంలో యేర్పడ్డ కోపంవల్లనో అబద్ధం వ్రాస్తే వ్రాశారు, అంతలో మునిగిపోయిందేమిటి, వెం II శాII వూరుకోకూడదా" అనిగాని లేక "పెద్దలుగదా? శుద్దాబద్ధంగా ఆలా వ్రాసి వెం||శా|| కి కృతఘ్నత్వాన్ని ఆపాదించడ మెందు” కనిగాని లోకులు “పంచశుభం పంచాశుభం"గా యెట్లాగా చెప్పుకోక మానరన్నది వాది ప్రతివాదులమైన మే మిరువురమున్నూతెలుసుకోఁదగ్గ ముఖ్యాంశం. ఇందును గుఱించి స్వయంగా చేవ్రాళ్లు చేసి యేదో వ్రాసుకుంటూనే వున్నాము. గురువుగారు హైదరాబాదుకు వ్రాసిన వుత్తరంలో సంగతులేమి "శృంఖలం"లో వ్రాసిన సంగతులేమి, మొట్టమొదట భ్రాంతిమూలకాలేమో అని నేననుకున్నాను గాని క్రమంగా అవి వారు బుద్ధిపూర్వకంగా వ్రాసినవే అని స్పష్టమవడంచేత లేశమున్నూ వాట్లనుగూర్చి యితరులమీఁద నాకు అనుమానం కలగడానికి అవకాశంలేదు. ఆకారణంచేత నేనుయితరులు తెచ్చిపెట్టినట్లు లిఖింపక యిటీవలి చర్యలో

“గురువరు - లందులకున్ మూలభూతు లగుట ధ్రువంబౌ”

అని వ్రాసియున్నాను. గురువుగారు మాత్రం, “సేలువులూ చేతికఱ్ఱా" నాకు లంచమిచ్చి యెవరో నన్ను తమమీఁదకు కయ్యానికి పురికొల్పినట్లు కృష్ణలోనున్నూ, ప్రజాసేవలోనున్నూ వ్రాస్తూవున్నారు. వారెవరు నాకివి యిచ్చారని వ్రాస్తూవున్నారో వారు