పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/822

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

926

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నా ప్రతిమకు హైదరాబాదులో మా చిరంజీవుల అవధాన సభలో వీట్లను యివ్వడానికి పూర్వమే యీవాదోపవాదాలు ప్రారంభమైనాయి. కాఁబట్టి హేతుహేతుమద్భావం కుదురదు. ఇదిన్నీకాక గురువుగారికింకా తెలియలేదేమోకాని నాకు మా యింటికి తెచ్చి సమర్పించింది సేలంకండువాగాని, సేలువులున్నూ చేతి కఱ్ఱాకాదు. ఈ సేలంకండువా దరిమిలానే యీవాదం ప్రారంభమయింది కనుక గురువుగారు యీ పైన వ్రాసేవ్రాఁతలో సేలంకండువా మీఁద యీదోషాన్ని ఆపాదిస్తే బాగుంటుందనుకుంటాను. ఇదియేలాపుట్టిందో నేను నాయెఱిఁగినంతలో ఆత్మవంచన లేకుండా వ్రాస్తూవున్నాను. జిజ్ఞాసువులు తెలుసుకొందురు గాక.

నాయందు గురువుగారికిన్నీ నాకు వారియందున్నూ ప్రేమాభిమానములు పూర్ణంగానే వున్నా యని నేను మొన్న మొన్నటివఱకున్నూ అనుకొనేవాణ్ణి. కాని గురువులు వ్రాసేవ్యాసాలలో కొన్ని అంశాలనుబట్టి మా గీరతరచనా కాలంనాఁటికే గురువుగారికి నాయందు అసూయ అంకురించిందని తేలుతూవుంది. ఆయంశమేమిటంటే, ప్రభాకరశాస్త్రులకు సంబంధించినది. అతఁడేమో; తి||శా|| గారి పంపున గురువుగారివద్దకు వెళ్లియేమో అడిగిన ట్లొకకల్పన (అభూతకల్పన) వ్రాస్తూ అందులో “అసలే చదువలేదు వెంll శాII అని చేవ్రాలు చేసియిస్తాను” అని వ్రాసేవ్రాఁతవల్ల గురువుగారి హృదయం అప్పటికే మాఱినట్లు విస్పష్టమేకదా! మాఱకేపోతే ఆ మాటకి అంతకోపం రావలసివుండదు కదా? వారి వుద్దేశంలో బ్రహ్మయ్య శాస్త్రులవారిని ప్రధానగురువుగా సంభావించడం యిష్టంలేనట్లు యిటీవలవ్రాఁతలు చెపుతూవున్నాయి. వాట్లను వుదాహరిస్తే చాలా పెరుగుతుంది. ముఖ్యాంశ మేమిటంటే! యిప్పటికి సుమారు యిరవై యేళ్లకుపూర్వమే గురువుగారికి వెంll శాII మీఁద అసూయ వుదయించింది కాని అది అంతర్గతంగానే వుంది. అంతట్లో కొల్లాపురంగోల రావడం తటస్థించింది. ఆప్రాంతంలోనే కృష్ణలో సార్వభౌమ బిరుద కనకాభిషేకాలను యీసడించి వ్రాశారు కృష్ణరావుగారు. ఆయన వెం||శా|| పేరెత్తలేదుకాని దాన్ని బలపఱచే శిష్ట్లాపరిమి, పండితులు, వెంll శాII పేరుకూడా యెత్తడంవల్ల అంతర్గతమైన ఆకోపాగ్ని మఱింత రవిలింది. శిష్ట్లావారి మేఘసందేశంమీంద యెవరిపేరుతోనో వీరువ్రాసిన విమర్శనానికి ఆయన కుమారుఁడు "వాగ్బంధ" మనేపేరుతో యిచ్చినజవాబులో వెంll శా|| పేరెత్తి వీరియందు లాఘవాన్ని ఆపాదించడమే కాకుండా “సార్వభౌమ" బిరుదాన్ని కూడా కొంతకలిపాడు. అదిన్నీ చిక్కేతెచ్చింది. "శృంఖలం" వ్రాసేనాఁటికింకా యీ గందరగోళం రాలేదు. కాని దానికి కొల్లాపురం గోలమాత్రమే ముఖ్యకారణం. ఇవన్నీ అయినాక “శృంఖలం" నా కళ్లబడ్డాక నేను "శాంతివ్యాసం" వ్రాశాను. దానిలో అవకాశం వున్నంత వఱకు గురువులను సమర్థించాను, లేనిచోట