పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/817

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

921


కూడా గురువుగారికి కవితా కల్పనగానే తోఁచింది. వ్యాకరణం చదువుకోవడం వల్ల, వెంll శాII కవిత్వం “భాగోత్ర" ప్పద్యాలయింది. వెంll శాII మనుష్యాధముఁడు కూడా అయినాఁడు. సర్వదా అట్లే అగుఁగాక. యేవిషయమందేనా వుత్తమత్వానికి ప్రయత్నిస్తే చిక్కు వస్తుందిగాని అధమత్వానికైతే చిక్కు రాదు. యిందుకు తార్కాణం గురువుగారు సర్వోత్కృష్టత్వానికి ప్రయత్నించి సంపాదించిన “సార్వభౌమ' బిరుదాదికమే అని లోకం గ్రహిస్తుంది. కనక విస్తరించేది లేదు. యీ అధమత్వమేనా నాకు అప్రయత్నంగా వచ్చింది, కాని సప్రయత్నంగా కాదుగదా? అబ్బో? అందుకు గురువుగా రొప్పుకుంటారా? నీవేమో? కృతఘ్నత్వదోషం నే నాపాదిస్తే దాన్ని పాపుకోవడానికి ప్రయత్నించావు. దాని మీఁద నీకీబిరుదు నేనిచ్చాను. కాబట్టి యిదిన్నీ ప్రయత్నించి సంపాదించికొన్నట్లే అంటారనుకుంటాను. విమర్శిస్తే నిలిచినా నిలువకపోయినా అంతట్లో యేదో కల్పిస్తారుగా? గురువుగారు. కోపంవచ్చినా వ్రాఁతలో గాంభీర్యం వుండాలి. అది లేకపోతే ప్రతివాది వూరుకున్నా లోకం గర్హిస్తుంది. మేమో లోకాన్ని గణించడం. యింక లోకం మేమ్మేంచేస్తుంది. 'నరకే సతికో దోషః, మరణే సతి కిం భయమ్" వార్ధక్యంలో కూడా వ్రాఁత బాల్యాన్నే జ్ఞప్తికి తేవడమేనా? "ముదిముప్పున బాల పాపచిన్నె" అంటారిదే కాఁబోలు ముగిస్తాను.

అనుబంధము

చదువరులలో యెంతోమంది నా పేర పద్యపూర్వకంగానున్నూ, వట్టి వచనంగానున్నూ వ్రాసే వుత్తరాలలో గురువుగారి ధోరణిబాగా లేదని వ్రాస్తూవున్నారు. యీ వుత్తరాలు నేను ప్రకటించడంవల్ల ప్రయోజనం లేదు. గురువుగారిక్కూడా కొందఱిట్టివీ వ్రాసేవుంటారేమో? ఆత్మవంచన లేకుండా ప్రవర్తించేవారు లోకంలో చాలా తక్కువగా వుంటారనేది సర్వసమ్మతమైనమాట కాకపోలేదు. మా వాదం లోకసమ్మతం కాదన్నది నిర్వివాదాంశం. కాని నాకు వచ్చిన చిక్కు జాతకచర్యలో వ్రాసిన నా విద్యాభ్యాసానికి గురువుగారి వుత్తరం వల్ల భంగం కలగడమే. దాన్ని వారించు కోవద్దని యెవరైనా అంటారనుకోను. గురువుగారి వుత్తరానికే నేను సమ్మతించే యెడల యెందఱో గురువులకు నేను కృతఘ్నుణ్ణి కావలసి వస్తుంది. అందుచేత పత్రికలో వ్రాఁతకు దిగాను. వచ్చిన వుత్తరాలు గురువుగారు తిట్టేతిట్లకు అసమ్మతిని తెలుపడమేకాక చాలాకోపాన్ని ప్రకటిస్తూ వున్నాయి. అట్టివి ప్రకటనార్హం కావు. వారు ప్రకటించమంటూవున్నారు. కొంత మృదుపాకంలోవున్న భాగాన్ని మాత్రం వుదాహరిస్తాను. కవిమండల మండన బిరుదాంకితులు మంగళగిరి కృష్ణద్వైపాయనా చార్యులవారి 22 పద్యాలనుండి కొన్ని