పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

922

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఉ. నోటఁగవీంద్రులాడదగునో? తమరాడినమాటలెల్ల నా
    ర్భాటముచేసికొంత, నవభారతకర్తల మంచు గోటుతో
    మాటలనాడుకొంట అది మాన కహంకృతి తెన్ను దెల్పదో?
    చాటుకవిత్వమొక్కొ? అది శస్త్రులవారి విశారదత్వమో? - 1

ఉ. పక్షముఁబూని పల్కెనని భావములోపల నెంచవద్దు స
    ద్వీక్షణకొంతచూడనది వెట్టిగఁ గానఁగనయ్యె "కృష్ణలో
    దక్షతతోఁ బ్రవేశమిడి తప్పులువ్రాసినమీదు వ్రాఁతమీ
    పక్షమువారె రోఁత అటు ప్రక్కకుఁ జూడకుఁడంట వింటినేన్. - 2

తే.గీ. మీరు వ్రాసిన వ్రాఁతకు సారమెఱుఁగు
       జాణ లెవ్వరు మెచ్చరు బాగు బళిరె?
       యనెడి వా రొక మేఁక తోలయినఁగప్ప
       రెందుకో శాస్త్రిగారి కీ క్రిందుదృష్టి - 3

యీయన 28 మార్చి 36 సం!! కృష్ణలోని తిట్లుచూచి వ్రాసినట్లు వ్రాసివున్నారు. 25-2-36 సం|| తేదీని నల్లా చిన్నరెడ్డి నాయుడుగారు 40 పద్యాలవఱకున్నూ వ్రాసినారు. అప్పటికింకా గురువుగారిధోరణి యింతగా పాకందప్పలేదు. "చెరలాటం" మొదలెట్టినప్పటికీ యింతగా దురుసులోకి దిగలేదనుకోవచ్చుననుట స్పష్టమే. అందుచేతనే యీయన పద్యాలలోని అంశాలు సరిగా తూకంతూఁచినట్టు గోడమీఁది పిల్లి వాటంగా వున్నాయికాని యే పక్షానికిఁగాని వరగడంలేదు. కొద్దిగా వుదాహరిస్తాను.

క్రొమ్ముటేన్గుల క్రుమ్ములాట

క. భారతమునంత గ్రంథము
   తీరుగ నాంధ్రమున నద్వితీయతఁబలుక
   న్నేరిచిన సూరిఁగూరిచి
   కోరి యెవరు మొక్క కుండ్రు? గురుభావమునన్. - 2

తే.గీ. . అరయఁగ డోలునకుగట్టువారుమీరు
      వీరణమునకుఁ బేరై నవారువారు
      బలపఱిచి వారిమాట పైనిలుపఁదగిన
      మీరె అసహాయవాదులై మాఱుతిరిగి