పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

907


గురువుగారు. దయచేత యెదటి పక్షానికి చేయూఁత యివ్వలేదన్నాడుకూడాను. యిస్తే ఆవలిపక్షమే జయించేదన్నమాట. యెందుకీ యప్రస్తుత ప్రసంగం! యిప్పుడు మళ్లా యిల్లా వ్రాస్తున్నారు. గురువుగారి సాహసం యెంతేనా వర్ణనీయం.

“చర్చించుకోగా, వెం||శా|| గారు నాయొద్ద సంవత్సర పరిమితి కాలమునకు తక్కువకాకుండ నుండిరనియు మాఖముకూడా ప్రారంభించి కొంచము చదివిరనియు స్మరణకు వచ్చినది” అంటారు గురువుగారు. మొదటిగురువులు శ్రీ భుజంగరావు పంతులవారివద్దను, తుదిగురువులు బ్రహ్మయ్యశాస్త్రులవారి వద్దనున్నూ తప్ప యిఁక యేగురువుల యొద్దఁ గాని మాసాలు తప్ప సంవత్సరాలు చదవలేదని వెం|| శా|| యేప్రమాణం బడితే ఆ ప్రమాణం చేస్తాడు. నిజమట్టిదే అయినా గురువుగారి వాదం కాదనడంకంటె వారి అభీష్టం చొప్పున సమ్మతిస్తే తప్పలేదుకాని నిజం వ్రాసిన “జాతకచర్య" తీరా ప్రచురింపఁబడ్డది. యిప్పుడు సవరించడం ఎట్లా? అదల్లావుంచుదాం. మాబిరుదాన్ని వెక్కిరించారు. పెడర్థం చెప్పారు, వెంకటశాస్త్రికేనా? చేతకానిది. వెనక పేరి కాశినాథశాస్త్రులవారి కిచ్చిన జవాబు గురువు లెఱుంగరనుకుంటాను. ఆ త్రోవలోనికి దిగితే వెక్కిరించవలసి వస్తుంది. వివాదం జరుగుతూవున్నప్పటికీ వెక్కిరింతలూ వేళాకోళాలు శిష్యస్థానానికి బొత్తిగా పనికిరావు. గురుస్థానానికిన్నీ అవి పనికిరావుగాని, ఆ మాట గురువులకు తోఁచాలి. మనకు తోస్తే యేం లాభం! గురువుగారేమాలోచించారో! కాని వ్రాసేవ్రాఁతంతా అప్రస్తుతమే. యింకా వారి బిరుదాలు సమర్థించడానికి కొంత ప్రయత్నించారు. అది పనిచేసినా చేయకపోయినా ప్రస్తుతం కాకపోదు. నేనిప్పుడు వ్రాస్తూయున్న "ఇటీవలిచర్య" ప్రకటింపఁబడితే ఖండిస్తామన్నారు. ఆఖండించే పుస్తకం పేరు “గర్య" అని కూడా వుదాహరించారు. నాది “చర్య" గనక వారిది “గర్య" యిదివరకే దానిలో గురువులకు సంబంధించిన మట్టుకు పద్యాలు కొన్ని వుదాహరించాను. వ్యాసాలలో వాటిని ఖండిస్తూనే వున్నారు. బహుశః ఇదే దానికిన్నీ పనికివస్తుంది. లేక పోతేనోయెప్పుడో వ్రాయఁదలఁచుకొన్నదిన్నీ పనికిరాదు. కాఁబట్టి వేఱే పరిశ్రమ మక్కఱలేదనే నా భావము. వారి భారతం మీఁద ఖండనవ్రాస్తే జవాబు వ్రాస్తామన్నారు. వోపికెవరికుంది? నేను వ్రాయను. యెవరేనా వ్రాస్తే తామిచ్చే జవాబెట్టిదో? యిప్పుడు తాము చూపిన "స్త్రీస్వాతంత్ర్యం” పద్యసమర్ధనం వలెనే వుంటుందని స్థాలీపులాకన్యాయంచేత లోక మిదివఱకే తెలుసుకొని వుంటుంది. యెంత పరిశ్రమచేసి సమర్ధించినా "స్త్రీ స్వాతంత్ర్యం పద్యం" కరుణానిరతులు అనే నన్నయ్యగారి పద్యందగ్గర కాదుగదా, ఆమడదూరంలో నైనా నిలవగలుగుతుందా? యింతెందుకు, నన్నయ్య పద్యంలో మాటలు వచనంలో యెక్కించినా అలాగే సరిపోతాయి. గురువుగారి పద్యాన్ని వచనంలో పెట్టవలసివస్తే