పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/804

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

908

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యేమవుతుందో? పరిశీలిస్తే వారికే తెలుస్తుంది. యిలా వ్రాస్తే చాలా వ్రాయాలి. పత్రిక భరాయించలేదు. గురువుగారు ప్రస్తుత విషయాన్ని విడచి తిట్టిపోస్తూవున్నందుకు లోకము యేమనుకుంటూవుందో? తెలపడానికి యిదివఱలో వక ప్రాజ్ఞ మహాశయుని వుత్తరం కొంత వుదాహరించినట్లు జ్ఞాపకం. ఆ వత్తరం ఆయన వ్రాసేటప్పటికింకా యింతగా గురువుగారు బరిదెగించలేదు. యిప్పుడు దాహరింపఁబోయే వుత్తరం నాదగ్గిరకు వచ్చేటప్పటికిన్నీ గురువుగారు అంతగా తెగించి తిట్టినట్లు లేదుగాని యీ వుదాహరింపఁబోయే వుత్తరం వ్రాసిన ఆయన శృంఖలాన్ని పనిగట్టుకొని చదవడం వల్ల కొంతయేవం కలగడాని కవకాశం చిక్కింది. యిదివఱలో వుదాహరించానన్నది ఆంధ్రదేశంలో వకదిక్కు సరిహద్దు నుండి వచ్చింది. యిపుడుదాహరింపఁబోయేదో? యింకొక దిక్కు సరిహద్దు ప్రాంతానిది. దీన్ని వుదాహరిస్తే లోకాభిప్రాయం తెలుసుకుని గురువుగారు జాగ్రత్తపడి పట్టుదల తగ్గించుకుంటే పత్రికలకు విశ్రాంతి కలుగుతుందేమోయని నా ఆశ. పాపం, కృష్ణ మెల్లిగా తప్పుకుంది. ఆపెకు వంకదొరికింది. యేమిటావంక అంటే ద్వాత్రింశద్దోషారోపణం కంటె యేం కావాలి? దానిలోనంబరువన్, దొంగతనమా? అన్నది. యిరవై అయిదోది కాఁబోలు “గురుతల్పం" తుట్టతుది పొత్తర్లు కట్టడం. వారు కోపోద్రేకంమీఁద యేం వ్రాసినా అందులో కొన్నిటి మాటకేంగాని కొన్నిటిని మనం అనువాదం చేయడం కూడా పాతకహేతువే అనుకుంటాను. కృష్ణ మానడం మానిందిగాని యీహేయప్రసంగాన్ని మాత్రం ప్రకటించి మఱీమానింది. యిది ప్రకటనార్హంకాదని ఆమెకు పూర్తిగా తెలుసును. అయితే యెందుకు ప్రకటించాలి? తాను విరమించుకోవడానికి కారణంగా దీన్ని అందఱికి తెలుపడాని కనుకుంటాను. యిలాటివి కావుగాని యేలాటివో కొన్ని వెనక మాగీరత శిష్యులున్ను ఆపాదించారు. వాట్ల నన్నిటిని ఒక పద్య పేటికలో యిమిడ్చి భద్రపఱచి లోకాభిరామాయణంలో ప్రచురించుకున్నాము. ఆ పద్య మ్మొదలు “చ. విటుఁడవివేకి" అన్నది. వలయువారందు చూడఁగలరు. యేమైనాసరే గురువుగా రాపాదించిన వాట్లట్లో గురుతల్పం దొంగతనం, తాగుడు యీలాంటి వాట్లకేనా ఖండన కనపరిస్తే బాగుండునంటారా? కాటికి కాళ్లు చాచుకొన్న స్థితి యిది అని గురువులే వ్రాశారు ఇదివరలో, కొలది కాలంలోనే వుభయులకున్ను దీని ఫలితం కనcబడే టప్పడు యిప్పుడు ఖండన మండనా లెందుకు? విచారించతగ్గవాళ్ళే విచారిస్తారుగదా? తోసేస్తే తోసేస్తారు. నెత్తిని రుద్దవలసొస్తే రుద్దుతారు. మన ఖండనా లేంపని చేస్తాయి? కోపానికేనా అనుగ్రహానికేనా మితి అంటూ వుండాలి. యీలా యేదో వ్రాస్తూనే వుంటే పెరుఁగుతూనే వుంటుంది. ప్రకటిస్తానన్న వత్తరం ప్రకటిస్తాను. “.... గురువుగారి శృంఖలంకాపీ నొక దానిని చూడవలయునని మీ వ్యాసములు చదువుచున్నప్పటినుండి బాధిస్తూయుండెను... వక