పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేఁడు

899


నన్ను మిక్కిలిగా దూషించారు గురువుగారు శృంఖల గ్రంథంలో, అది నాకు దొరికింది. నాలుగేండ్లెట్లో సహించాను. కనుకనే వారి కాలికి ఆ మధ్యకాలంలో మహాసభలో పెండేరం తొడిగాను. పిమ్మట మాఖాంతము చదివినాఁడు అనే శుద్దాబద్ధపు వుత్తరం కూడా హైదరాబాదుకు వ్రాసినది బయలు పడ్డది. అప్పుడు వ్యాసత్రయం రాసినారు. అందు మృదువు తప్పలేదు. విషయమంతా యింతే. దీన్ని మీరే విచారించి యేదో తేల్చండి. యిఁక నేనేమిన్నీ వ్రాసేది లేదు. యెందుకు? గురువుగారి వ్రాఁతలో సారం నాకు కనపడడం లేదు. లోకానిక్కూడా కనపడడం లేదని తేలితే నా కంతటితో సంతృప్తి. అందుకై మిమ్మిట్లు ప్రార్ధించడం. లేదు, నాదే తప్పుగా వున్నట్లు తోస్తే ఆ మాటేనా వ్రాయండి. అదిన్నీ మీకిష్టం లేకపోతే యూ వ్యాసాన్ని యీ వుత్తరం సహా ప్రకటించి వూరుకోండి. యేం చేసాను.

★ ★ ★