పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషావాచ్యా గురోరపి

895


సభను సమకూర్చండి. నాలుగు రోజులు వ్యవధిలో వుండగా తెల్పండి హైదరాబాదువారికి కూడా తెలియజేయండి. అప్పుడొక్క సుబ్బారావుగారు మాత్రమే వుండివుండరు. మఱికొందరున్నూ వుండివుంటారు. మీ ప్రసంగ సందర్భంలో వారున్నూ వస్తారు. వారివీరి సమక్షాన్నే మన గురువుగారి యెట్టయెదుటనే యితరులెందుకు? మీరే మందలిస్తురుగాని. మీకేం అధికారం లేదా? లేదనేవారుంటే చూచుకోవచ్చు లెండి. నరంలేని నాలుకకదా? అని దాన్నియేలాపడితే అలాతిప్పుదామని మీరనుకోవడం యుక్తమే. గురువుగారు యీలాటి ఆధారాలమీఁద బెండై వుండడం అనాలోచనపని. వారు ఆలోచన కలవారే అయితే వారిజీవితము మీచేత హరికథగా వ్రాయబడడానికి వప్పుకొంటారా? దాన్నాలావుంచుదాం. ప్రస్తుతం మీకు కావలసింది నన్ను మందలించడమేకదా? దాని ప్రయత్నంలో వుండండి, ఆశీర్వచనపద్యాలు తగలబెట్టుకొమ్మనడాన్ని గూర్చి కూడా పనిలోపని నన్నే మందలిస్తురుగాని, యితరుల దోషానికిక్కూడా యితరులు మందలింపఁబడడం యిప్పటి మనపరిపాలకుల మతగురువు బోధించిన విషయమే. అన్నిటికీ నన్నే మందలిస్తురుగాని. మీ హరికథలోవున్న చిత్రాతిచిత్రాలకుకూడా గురువుగారుగాని మీరుగాని సమాధానం చెప్పలేక పోయేయెడల నన్నే మందలిస్తురుగాని దాని కెవరినో అక్కరలేదు. పీఠిక వ్రాసిన శ్రీయుత టేకుమళ్ల ఆచ్యుతరావు పంతులు యమ్.యే.యల్.టి. గారినే అధ్యక్షులుగా కోరుకొందాం. వారే మందలిస్తారు కాబట్టి మనవి చేసుకొన్నాను. వెనుక మీపేరెత్తుకొన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే వ్రాశాననుకొన్నాను. యిప్పుడు మిక్కిలి వినయంగా చాలా గౌరవప్రదమైన మాటలనే యుపయోగించాను. అయితే మీకీమాటలు కూడా కోపకారణమే అవుతాయేమో? నన్నింత గౌరవించి వ్రాయడ మెందుకంటారేమో? తినబోతూ రుచులెందుకు? ముందు మీ ధోరణినిబట్టి యేలావెళ్లమంటే ఆలాగే మీ ఆజ్ఞానుసారం వెడతాను. మీకు నామీద కోపంవచ్చింది కాని నేను మిమ్ములనుగూర్చి వ్రాసేఘట్టంలో ఇటీవలి చర్యలో మీదోషం లేశమున్నూ లేనట్లే వ్రాసివున్నాను. దాన్ని దిద్దక ఆలాగే వుంచుతాను. దాన్ని వుదాహరిస్తాను.

క. "ఇం దొకయంశము పరికిం
     పం దగు “ముక్త్యాల" చరితపట్టున బ్రహ్మం
     బుం దెగడరాద గురువరు
     లందులకున్ మూలభూతులగుట ధ్రువంబౌ”

యేమైనాసరే? శిష్యులంటే మీరే శిష్యులు గురువుగారి యుద్దేశాన్ననుసరించి యేలామార్చి వ్రాయాలంటే ఆలా వ్రాస్తూన్నారు. ఆ త్రోవచేతకాకే నేను గురువుగారికి ద్వేషినైనాను. మీరు గురువుగారి హృదయం బాగా కనిపెట్టేరు. తప్పులున్నను సమర్థించాలని