పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

894

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కృష్ణశాస్త్రిగారి శిష్యుఁడనని చెప్పితిని, అప్పుడు సుబ్బారావుగారు మీ గురువుగారు వేంకటశాస్త్రిగారి శిష్యులట? కదా” అనిరి అని యిప్పుడు బొంకితే పోదు. యీబొంకులకేమి? అవసరాన్నిబట్టి బొంకుతూన్నారు బ్రహ్మంగారను కొందాం పైఁగానన్ను మందలింపచేయాలనికూడా ఆయనకు కుతూహలంగదా! సుబ్బారావుగారు మాటలాడడమే చేతగాని శుంఠ అనుకోవడానికి వీలులేదు. హైస్కూలులో కాబోలును టీచరనో లేక కాలేజీలో టీచరనో మన బ్రహ్మంగారు వ్రాస్తూనే వున్నారు కాని ఆయన యీయనతో చేసినట్లు యీయనవ్రాసిన ప్రసంగం నిజమే అయితే వట్టి దద్దమ్మగా భావించవలసివస్తుంది. బ్రహ్మంగారి మాటలంటూ గురువుగారెత్తిచూపిన వాటికంటే “సుధర్మలో" బ్రహ్మంగారు ఆడిన అబద్ధాలు కొంత సమన్వయంగానేనా వున్నాయి. ముక్త్యాలప్రసంగం రెండింటిలోనూ సృశించనే లేదు. సుబ్బారావుగారి కల్పనగా అపలపిద్దామనే బ్రహ్మంగారి వూహ. వుంటారు బుద్ధిమంతులు. వకరియిల్లు తగులబెట్టి తగులబెట్టలేదని కోర్టులో ఋజువు పర్చుకోగలిగారట యెవరో ఆమధ్య, అంతకన్న దీనిలో కష్టమేముంది? నరంలేని నాలుకేకదా? సత్యం అసత్యంగానూ, అసత్యం సత్యంగానూ కార్యార్థమయి అపలపించడానికి ఆ నాలుక కొందఱికి తోడ్పడుతుంది. దీన్ని గురించి యీ మధ్యనే “ప్రజామిత్రకు” కాఁబోలును వ్యాసంవకటి పంపినట్లు జ్ఞాపకం. అయితే గురువుగారు కేవలం శుద్ధ అమాయికంగా వ్రాసినవ్రాఁతకన్న బ్రహ్మంగారు సమాయికంగా వ్రాసిన పూర్వోత్తర సందర్భం బాగా వుండడం చేత బ్రహ్మంగారిని మా సతీర్దులుకూడా కనుక అభినందిస్తూ “మాట తల పెట్టడం నాది తప్పే నాకంతటి అర్హతలేదు కాని యీ గాథకంతకూ మూలకారణం తమ హైదరాబాదు ప్రసంగమే అవడంచేత యెత్తుకోక తప్పిందికా"దని మనవిచేసుకొంటాను. పనిలోపని యింకొకటి కూడా మనవి చేసికొంటాను. అయ్యా! మీరు సుమారు అయిదాఱుమాసాల నాఁడు నావద్దకువచ్చి వక విషయమై నాసమ్మతిని కోరివున్నారు. నేను అసమ్మతిని తెలియఁజేసి వున్నాను. యీ అంశాన్ని పాలకొల్లు వ్యాసంలో కూడా గూఢంగా సూచించివున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మనవి చేసుకుంటూ వున్నాను. ఆపనిమాత్రం చేయకుండా వుండడానికి మిమ్ము ప్రార్థిస్తూ వున్నాను. నేను మీపేరెత్తినంత మాత్రంలోనే నా మీద మీకంత కోపం వచ్చి నన్ను మందలింపజేయాలని వ్రాయగలిగారే! దానిలో అంతతప్పున్నట్లు మీకు తోచిందండీఁ కానివ్వండి, యిప్పుడు యింట్లో గదిలో మాత్రమే కూర్చుండే వోపికలోవున్నాను. కొంచెం వోపికకలిగితే ఆశీర్వచనపు పద్యాలు తగులబెట్టటాన్ని సమర్ధించడానికి మన గురువుగారు సభచేయించేయెడల ఆ సభకి యేలాగోవస్తినట్టాయెనా? తమ దర్శనం చేసుకోకపోను. అప్పుడు మందలింపచేసే ప్రయత్నం చేస్తురు గాని యింతలో తొందరెందుకు? తొందరే అంటారా? అయితే యీలోగానే అట్టి