పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/792

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

896

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గురువుగారన్నమాట మీరు నిర్వహిస్తూవున్నారు. యిప్పుడీ విషయం మీవద్ద చదువుకుంటే గురువుగారి అనుగ్రహానికి నేనున్ను పాత్రుణ్ణి కాఁగలను. కాని అరవై యేండ్లున్నూ కాక అఱవైయాఱేండ్లు దాఁటవచ్చాయికదా! యీ విద్యాభ్యాసం జరుగుతుందా? “నందోరాజా భవిష్యతి" దీనికేంగాని మందలింపుకోసం సభ కూర్చే ప్రయత్నం చేయండి. దానిలోనే “ఆశీర్వచనపు పద్యాలు తగల బెట్టడం" ప్రసక్తినికూడా రాజమండ్రిలో ప్రముఖులు కొందఱేనా కలగజేసుకొని తేలుస్తారు. యీలాగానే ఆ యీ సందర్భాలువున్న “దురుద్ధరదోషశృంఖలాన్ని" ప్రచురించేలాగున్నారు. గురువుగారిని వారి "చెరలాటం"లో వున్న ధోరణి తెలుపుతూ వుంది. అంత వరకేనా నిరీక్షింపవలసిందని నావిజ్ఞాపనగా మనవిచేయండి. నేనువ్రాసే మాటలు దూరాలోచన కలవిగా వుంటేనే స్వీకరించమనండి, బ్రహ్మకైనా కాదు భగవంతునకైనా సమర్థించడానికి "తగుల బెట్టమనడం’ శక్యం కాదని మళ్లా మనవిచేసుకుంటూ విరమిస్తూవున్నాను. విరమిస్తూవకమాట వ్రాస్తూవున్నాను. శ్లోకపంచక నిరాకరణంలో చాలావ్యత్యాసాలు గురువుగారు వ్రాసివున్నారు. ఆ వ్యత్యాసాలతో నాకుపనిలేదు, తుట్టతుదిని "అమంగళం, అశుద్ధం, తగలఁబెట్టుకొమ్ము, బూడిద దొరుకుతుంది” అనే ప్రసంగాన్ని రాజమండ్రి పౌరులలో అష్టాదశ వర్ణస్థులలో నెవరిచేత నేనా సమర్ధింపిస్తే నేను తమపాదధూళిని శిరసావహించడంలో విశేషమేముంటుందిగానీ మీ విశ్వబ్రహ్మశిష్యుఁడి పాదధూళిని శిరసావహిస్తాను. ఆ పిమ్మట యీ అంశాన్ని కూడా చేర్చుకొని మీ దురుద్ధరదోషశృంఖలాన్ని మీరు ప్రకటిస్తే చాలా శోభగా వుంటుందని మనవి చేసుకుంటూవున్నాను, గురువు గారిని గూర్చి యీపని జరిగేలోగా మాత్రం దాన్ని ప్రకటించవద్దని పునరుక్తిగా కనపబడినప్పటికీ మళ్లామళ్లా వ్రాస్తూవున్నాను. ఆ తగల బెట్టడాన్ని సమర్ధించలేక నేను మీ ప్రత్యర్థికి మీకు వ్యతిరేకించే మాటలతో అభిప్రాయ మిచ్చాను. మీవిన్నీ యిలాంటివి యితర ప్రసంగాలుకూడా వున్నాయి. అవియేలాగో తప్పుకుంటే తప్పిపోయాయి. ఆదేశాన్నుంచి యీ దేశం వచ్చి “మీ కెంతతోస్తే అంతే యివ్వండి" అంటే జవాబు చెప్పలేక పోయాను దీన్ని సమర్ధిస్తే యింక మనకు వాదోపవాదాలక్కరలేదు. అబద్ధాలాడుతూ వున్నారు. అని పత్రికల్లో పెద్ద హెడ్డింగులు పడనక్కరలేదు. యిందులకే ప్రయత్నించండి. క్షమించండి, ఆ హెడ్డింగులు పెట్టేవారు నా కేలాటి మిత్రులో తామే యెరుఁగుదురు. వారు నా కనుకూలంగా వ్రాస్తూవున్నా అందులో లోపాలను కూడా నేను సహించేదిలేదు. యీ విషయం ముందు దేవర వారికి నావ్రాఁత వల్లనే స్పష్టపడుతుంది. దానితో వెంll శాII తత్త్వం తమకేకాక లోకానిక్కూడా విశదమవుతుంది. యెప్పటికి యథార్థము యథార్థమే. కపటం కపటమే. యింతే నామనవి.


★ ★ ★