పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా పాలకొల్లు ప్రయాణము

875


రోజూ అధమం వకమాటేనా నన్ను తలపెట్టకుండా వుండరని యెంతమంది వల్లనో వింటున్నాను. ఎవరో యెందుకు, యీ సంగతి శ్రీ గురువుగారుకూడా సుమారు నెలరోజులనాడు చెప్పారు. యింతగా నన్నభిమానిస్తూ వుండే యీయన విషయంలో మన మేమిన్నీ చేతనైన ప్రత్యుపకారం చేయనే లేకపోయాముగదా అని తోఁచి, యుక్తకాలం గతించింది యిప్పుడేమనుకుంటే యేం లాభమని పస్తాయించి, యేనాఁటి కానాఁడుగా వ్రాయుచున్న “ఇటీవలిచర్య" అనే పుస్తకాన్ని కృతి యిద్దామని నిశ్చయించి ఆయనతో కూడా చెప్పినట్లు జ్ఞాపకం. మనంతట మనం యిచ్చేటప్పుడు మనకాయన అంగీకారంతో అవసరమే ముంటుంది? ధనాపేక్షతో చేసేపనేమన్నా అయితే అంగీకారం లేనిదే లాభించదేమో అనుకోవాలి. యిది కృతజ్ఞతకుగాను మనంతట మనమై ఋణం తీర్చుకొన్న మోస్తరుగా చేసేపని గనుక ఆలాటి సందేహాలతో లేశమున్ను అవసరం వుండదుగదా? ప్రసక్తాను ప్రసక్తంగా యింకోటి యిక్కడ వ్రాస్తూ వున్నాను. సుమారు రెండు నెలలనాఁడొక హరికథకుఁడు నావద్దకు వచ్చి, అయ్యాఁ మీ జీవిత చరిత్ర హరికథగా వ్రాయడానికి నాకు మీరు సమ్మతి నిప్పించవలసిందంటూ కోరేడు. దానిమీఁద అబ్బాయీ హరికథల కీలాటి లాకలూకాయి చరిత్రలు పనికిరావు, ఆ కథల మాదిరి వేఱు, అదిన్నీకాక అచ్చుపడి వున్నదాన్ని బట్టి నీవు వ్రాసుకుంటానంటే నేను అడ్డడానికి నాకేమధికారం వుంది? వున్న సంగతిమాత్రం యిది అని బదులు చెప్పేను. అతఁడు వ్రాస్తాడేమో? నాకు సుతరామున్నూ యిష్టం లేదు. ఇదివఱలో అతఁడు వ్రాసినదాన్ని చూస్తిని, రసాభాసంగా కనబడింది. మనక్కూడా అదేగతి పడుతుందేమో అని భయం. చరిత్రలో అవక తవకలున్నా గ్రంథకర్త సమర్థుఁడైతే యెట్లోవాట్లను తోళ్లను బాగుచేసినట్లు బాగుచేసి లోకానికి ప్రదర్శిస్తాడు. అట్లుకాకపోతే మంచి విషయాన్ని కూడా చేతగాని గాయకుఁడు త్యాగయ్య కీర్తనలమీఁద కూడా అసహ్యత కలిగించినట్లు చేస్తాడు. యెట్లు చేసినా వద్దనడానికి మాత్రం మనకధికారం లేదనుకుంటాను. కాని ఇప్పటికాలంలో లీగల్‌గా యేమేనా ఆధారం వుంటుందేమో! అది నాకు తెలియదు. దొరగారిక్కూడా యిష్టం లేకపోతే నాలాగే యేదేనా పత్రికలో వ్రాయించనే వ్రాయిస్తారు గాని కొట్టరు గదా! అనే ధైర్యంతో కృతిమాత్రం పెట్టదలంచుకొన్నానన్నది ప్రస్తుతం. ఆవూహతో శ్రీ ప్రకాశరాయణింగారికి 'ఇటీవలిచర్య'లో కొంత వినిపిస్తూ మా గురువుగారు నా మీఁద ఆపాదించిన అపవాదాలని గూర్చి కూడా వినిపిస్తూ వుండఁగా ఆయనతో కూడా మాగురువుగారీ ప్రసక్తిని శ్రుతపఱిచినట్లున్నూ దానికితాము సమ్మతింప నట్లున్నూ నిన్న శ్రీ దొరవారు కూడా సూచించారు. యిందఱు సమ్మతింపని విషయంలో యీ యసమర్థతా స్థితిలో యీ వ్యాసాలెందుకని చదువరు లనుకోవచ్చును గానీ "అప్రతిషిద్ధ