పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

824

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పడవలదు” అనునది. గురువుగారు నా మాటను విశ్వసించిరి. పిమ్మటఁ గొలఁది దినములలో శ్రీవారి యింట జరుగు వివాహములో నేను వారిని సందర్శించితిని. అపుడు "నన్నెందులకు వారించితివి" అని ప్రశ్నించిరి. సమాధానము చెప్పితిని. తృప్తిని మాత్రము గురువుగారు చెందనియట్లు గ్రహించితిని. వెంటనే విమర్శించిరో మఱి కొన్నాళ్లకు విమర్శించిరో కాని శ్రీ నరసింహ శాస్త్రులవారి, ఆంధ్ర మేఘసందేశమును పుల్లెల శ్రీరామశాస్త్రులవారి పేరుతో విమర్శించిరి. శ్రీరామశాస్త్రులవారిని నేను మాగురువుగారి ద్వారముననే యెఱుఁగుదును. విద్యా పక్షపాతులు. కడుంగడు యోగ్యులు. ఎవరినిగాని నిర్హేతుకముగాఁ గాని సహేతుకముగాఁగాని తూలనాడరు. అట్టివారి పేరుతో విమర్శించు నా మేఘసందేశ విమర్శనము మిక్కిలి యప్రగల్భ వాక్యములతోడను, వెక్కిరింపు మాటలతోడను, నిండియుండుట మిక్కిలి విషాదకరము. సర్వశాస్త్రముల యందును జక్కని పరిశ్రమ చేసిన నరసింహశాస్త్రులవారి నంతగాఁ దృణీకరించుట మా గురువుగారి కే మాత్రమును లాభమును కలిగింపదని నేను దెలిసికొంటిని. నరసింహశాస్త్రులవారు తమ భారతమును “నీరసము” అని యందురుగాక. ఆ మాటను ఖండించుట కామహాపండితుని గడ్డిపఱకగా నపలపింపఁ జూతురా? నిజమున కా శాస్త్ర విదుఁడు గడ్డిపఱకయే యగుచో అట్టి గడ్డిపఱక తెలిఁగించిన పొత్తమును దమ పేరుతోఁగాని వేఱొక పేరుతోఁగాని తమ యాజమాన్యమునఁ బ్రకటిత మగు పొత్తమున నేల ప్రకటింప వలయును? కావున మేఘసందేశమున మా గురువులు చూపిన దోషములు నిల్చినను, నిలువకున్నను, ముందాపనికిఁ బూనుటకే నేను సమ్మతింపను. తామనుకొన్నట్టులా తెలిఁగింపు సర్వమును నయుక్తమై ఖండింపఁబడినను దమ కవిత్వము నెడల నాయన చూపిన నిరాకరణము ఖండింపఁబడదు. కావున మా గురువుగారి యుద్యమ మిటఁజింత్యము. నరసింహశాస్త్రుల వారికో, వారి కొమరులకో శ్రీ మా గురువుగారు వారి ప్రస్సులోని "చాకలి వానిచే జవాబు చెప్పింపఁ బూనుట" లోనగు ననాలోచిత ప్రసంగము ప్రతిపక్షుల కపకరింపక, పరమోపకారమై, వ్రాసిన వారి కెంతయపకృతి చేయవలయునో యంతయుఁ జేయఁగల్గినదని నేనపుడనుకొంటిని. అనుకొనిన లాభమేమి? ఇపుడేని శ్రీవారితో మనవిఁజేసి దీని నుండి మరలింపఁ గల్లుదునా? మరలింపఁజాలను. పూర్వము నా మాట యందుఁ గొండొక విశ్వాసమున్నను నిపుడది లేదని నా కనేకుల వలనఁ దెలిసినది. వారి పత్రికలోని యక్కరము లీయూహనే ధ్రువపఱచు చున్నవి. అక్కతమున నేను స్వయముగా దర్శనమునకేగి మనవి చేసిన నొకింతలోఁ దేలెడి దాని కింతగాఁ బరిశ్రమ చేయవలసి వచ్చినది. నాయందిపుడు శ్రీవారికిఁ గోపకారణమేమని చదువరులనుకో