పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

825


వచ్చును. సుమారు పదియేండ్లనాఁడు నా వ్రాసిన “వైకర్తన శబ్దవిచార’ మొకటి. అవసరమైనపుడిద్దానిని విస్తరింతును. ఇటీవల శ్రీవారి యాజ్ఞానుసారముగా నేను పాలకొల్లు వెళ్లి యచట వారి హృదయములోనున్నచొప్పున నుపన్యసింప నేరక పోవుట యొకటియుఁగా శ్రీవారి యక్కరముల వలన నవగత మయ్యెడిని. ఈ యపోహమును మII రాII రా|| నాళం కృష్ణారావుగారు లోనగు తత్రత్యప్రాజ్ఞులు పలుసార్లు చెవినిల్లుగట్టుకొని పోరి మరలించిరి. మరల యధాపూర్వముగ నాయందనుగ్రహము కల్గియే యుండిరి. కాని యిటీవల శ్రీవారు "శ్రీ కొల్లాపుర సంస్థానమున కేగి వచ్చిన పిమ్మట" శ్రీ పుల్లెల శ్రీరామశాస్త్రులుగారి పేరితో బ్ర||శ్రీ|| వనం సీతారామశాస్త్రులవారి శ్లోక పంచకమును మిక్కిలి గాఢమైన పాకముగా విమర్శించి ప్రకటించిరి. ఆ విమర్శనమున కాపండిత మౌళి తోఁచిన సమాధానములను వ్రాసి యభిప్రాయమునకై పలువురితో పాటు నాకడకును వచ్చిరి. అది మా గురువుల పేరితోడనే యున్నచో నేను దప్పికొనుటకు వీలిచ్చెడిది. అట్లుగాక "ఏతం పెట్టన్నట్లు" పల్లెల శ్రీరామశాస్త్రిగారి పేరితో నున్నది. నేను శుశ్రూష చేసినది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారికిఁగాని, పుల్లెల శ్రీరామశాస్త్రులవారికిఁగాదు కావున నభిప్రాయ మీయక తప్పినది కాదు. దాని నా శాస్త్రులవారు తక్కు పండితుల యభిప్రాయములతో బాటుగా నచ్చొత్తించి ప్రకటించికొనిరి. అది మొదలు నాయెడల విశ్వాసము తప్పి నన్ను గొండొక తరగతిమాటలతో నిరాకరింప మొదలిడిరి. ఈ నిరాకరణమును గూడ నేను గుంటూరికి రాకపూర్వము చూడనేలేదు. ఇక్కడనే వారి పత్రికలోఁ జదివితిని. బ్ర||శ్రీ|| హరినాగభూషణముగారిని గూర్చి వ్రాసిన బహిరంగలేఖను గూడ నచటనే చదివితిని. అదియును నాకు నచ్చినదికాదు. పల్లెలాయన నరసింహశాస్త్రుల వారిని దూషించుట తగవు కాదని నాగభూషణముగారు వ్రాయఁగా, గురువుగారు దానిని భూషణముగా సమర్ధింపఁ బూనినారు. నాగభూషణముగారు మా గురువుల యందు మిక్కిలి భక్తులు. బందరులోని యభినందన సభను గూర్చిన ముఖ్యులలో నొకరు. అట్టివారు వారి విద్యా గురువులను నిందించుటకు సహింపక మృదువుగా నేవోకొన్ని మాటలు వ్రాసినందులకుఁ గినిసి వారిని తృణీకరించుట యంత వీలుగాదనియే నే ననుకొంటిని.

“ఉచిత మనుచితం వా కుర్వతా కార్య జాలం! పరిణతి రవధార్యా యత్నతః పండితేన” ఈ వాదము శబ్ద శాస్త్రాదులకు సంబంధించినది కాదు. కావున సూత్రాదులుదాహరించి సమర్ధింప వలసినది కాదు. రసమునకు సంబంధించినది. ఇందును గూర్చి యాలంకారికులు వ్రాసి వ్రాసి, “సహృదయాః ప్రమాణమ్” అని విరమించుట సుప్రసిద్ధము. కావున మా గురువులు గూడ దీనికి సమ్మతింతురని నా విశ్వాసము. ఇఁక నొకటి కవిత్రయ