పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

75


సరిపెట్టుకొని పెళ్లాము తెలివి హీనతకు విచారపడి “స్త్రీలకు విద్యావాసన లేకపోవడంవల్ల కొన్నియీలాటి ప్రమాదాలు వస్తా" యనుకొని శ్రావణభాద్రపదాలు రెండు మాసాలున్నూ యీ యింటిమీంద కాకి ఆ యింటిమీంద వాలడానికి వీలులేకుండా వర్షాలు కురిసేరోజులనిచెప్పి గృహస్టులు సాధనసామగ్రి జాగ్రత్త పెట్టుకుంటారు. అవి మాసాలు. యీమాత్రము నీకు తెలియదని నేను అనుకోలేదని చెప్పేటప్పటికి ఆ యిల్లాలు తన తెలివితక్కువకు తనలోతానే సిగ్గుపడి భర్తను క్షమాపణ నేడుకొన్నట్టు పుక్కిటిపురాణంగా యెవరో చెప్పంగా చిన్నప్పుడు విన్నాను. యీ యితిహాసాన్నిబట్టే అనుకుంటాను యానాం సమీపంలోవున్న వొకపల్లెటూళ్లో కొంచెం పప్పుభోట్లు మాత్రం వచ్చిన వక బ్రాహ్మణ సోదరద్వయాన్ని శ్రావణభాద్రపదాలని వేళాకోళంగా మాఱుపేరుతో వాడుతూ వుండేవారు. ఆ సోదరద్వయం వేఱువేఱు స్థలాల్లో వొకటేరోజున రెండు బ్రాహ్మణార్థాలు చేసేటట్టున్నూ అదికూడా మోసంలోకే చేరుతుంది కనుక యీ పేరు వాళ్లకు వచ్చినట్టున్నూ చెప్పంగా వినడం. మొత్తం యీతిబాధల్లో అతివృష్టి మొట్టమొదటిదన్నమాట. యీరోజుల్లో సన్యాసులుకూడా సంచారం చేయరు. యీతిబాధలు లేనిదేశమే నివాసయోగ్యమైనది. అట్టిది ప్రపంచంలోకల్లా మనభరతఖండమే అని చెప్పకుంటారు. అలాటి దేశంకూడా యితరదేశ సంపర్కంవల్ల యిప్పడు యెన్నోయీతిబాధలకు కొత్తకొత్తరకాలకు స్థానభూతం కావలసి వచ్చిందికదా! అని విచారం కలుగుతుంది. దీపం దగ్గిఱనుంచీ యిప్పడు మనం పరదేశాలమీఁద ఆధారపడి జీవించవలసిన దుస్థితిలో వున్నాము. పంపులున్నాయని నూతులు కప్పేసుకుంటూ వున్నచోట్లెన్నో కనపడతాయి. యేకారణంచేతేనా పంపు మరమ్మతుకు వస్తే అది సవరణ అయేదాకా దాహానికి నీళ్లు సున్నా అన్నమాటేకదా! మోటారూ, సైకిళూ కాలినడకకు స్వస్తిచెప్పాయి. మరబియ్యం దంపుడు బియ్యానికి కొక్కెట్టాయి. డబ్బాపాలు తల్లిపాలని తోసిరాజన్నాయి. యిలా వ్రాస్తే యెన్నిటినో వ్రాయాలి. పూర్తిగా జీవనం పరాధీనమైపోయింది. రాజకీయ విద్యలకు ధనాపేక్ష విధాయకమే అనుకుందాం. స్వదేశ విద్యలకుకూడా దానితో సంబంధం కలిగింది. ఆ యీ సందర్భాలన్నీ పూర్వంకంటేకూడా యిప్పడు ప్రపంచాన్ని యీతిబాధామయంగా చేసివేసినట్టు తోస్తుంది. విస్తరించినకొద్దీ యీ విషయం పెరుంగుతూనే వుంటుంది. ప్రస్తుతస్థితిని బట్టిచూస్తే సంసారజీవితమంతా యీతిబాధలతోనే నిండివుంది. పట్నవాసం కంటె పూర్వం పల్లెటూరు కొంత యీతిబాధారహితంగా వుండేది. ఇప్పుడో అక్కడవుండే సదుపాయాలు పల్లెటూళ్లల్లో కనపడవుగాని అక్కడవుండే యీతిబాధలు మాత్రం కనపడతాయి. కొన్నివూళ్లకి కోఁతులబాధ విశేషించి కనపడుతుంది. యీ కోఁతులు తాటాకు కొంపలవాళ్లకన్నా పెంకుడు కొంపలవాళ్లని యొక్కువగా బాధిస్తాయి. కొన్ని వూళ్లవాళ్లు వీట్లకుజంకి పెంకుటిళ్లు

o -