పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తెలుసుకొని వుంటారు. కనుక ఆమితికికూడా పుష్కరకాలంలోవున్నవాళ్ల వ్రాతలకు తోవాతెన్నూ వుండకపోవడం అంత విడూరం కాదుగదా? నాలుగు మాటలు వక యితిహాసరూపమయినవి ఆ యీ యీతిబాధలలో మొట్టమొదటిదానికి సంబంధించినవి వ్రాసి దీన్ని ముగిస్తాను. వకబ్రాహ్మణుండు శ్రావణభాద్రపదాలు వస్తున్నాయని సప్రయత్నంగా యింట్లో ఆయీ సామగ్రి జాగ్రత్తపెట్టుకుంటూభార్యతో - "శ్రావణభాద్రపదాలు వస్తున్నాయి సుమా" అని మధ్య మధ్య అంటూ వుండేవాండు. యీ సందర్భం యితరులుకూడా వింటూవుండేవారు. పప్పు, వుప్ప, కట్టెలు, బియ్యం, నెయ్యి, నూని వకటేమిటి? శాయశక్తులా అన్నీ తెచ్చి భద్రంగా జాగ్రత్త పెట్టుకున్నాండు. అంతల్లో యేదోపనిమీద హఠాత్తుగా యేదో వూరికి ప్రయాణం తగిలింది ఆగృహస్టుకు. సరే బయలుదేటి వెళ్లాండు. వెళ్లీవెళ్లడంతోటట్టే యిద్దఱు బ్రాహ్మణులు ఆ యీ సంగతి సందర్భా లెఱింగినవారు దర్భాసనాలతో వచ్చి వాకట్లో కూర్చున్నారు. ఆయింటి యజమానురాలు చూచి నాయనలారా ఆయన గ్రామంలోలేరు తమ రెవరో దయచేశారు. స్వయం పాకస్టుల్లా వున్నారు. ఆ పంచపాళిలో స్వయంపాకం చేసుకోండి అంటూ వుపచారం చెపుతూ వుండంగా ఆ మోసగాళ్లు - మాకాలాటి నియమంలేదు. మేమే శ్రావణభాద్రపదాల మన్నారు. అనేటప్పటికి ఆ అమాయకపు యిల్లాలు - వోహో! తమరేనా! నాయనా! శ్రావణభాద్రపదాలు? మా ఆయన మీరాకను గూర్చి చెపుతూనే వుండేవారు. సమయానికి వారు వూల్లో లేకపోవడం తటస్థించింది రేపో యెల్లుండో వస్తారంటూ చెపుతూ ఆదరం కనపఱచేటప్పటికి మీ ఆయన మాకు వచ్చే త్రోవలో కనపడ్డారనిన్నీ వారు వచ్చేవఱకున్నూ వుండి మటీ వెళ్లవలసిందనిన్నీ తొందర పనిమీంద యొక్కడికో వెడుతున్నాననిన్నీ మటీ మటీ చెప్పారనిన్నీ చెప్పి అక్కడే తిష్టవేసి- అమ్మా మీవంటి శిష్టాచార సంపన్నుల గృహాల్లో మాకు స్వయంపాకంతో అవసరంలేదు. నీవు మహాయిల్లాలవు, నీచేతి ప్రసాదమంటే? సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి ప్రసాదమే అని స్తుతిచేసి వచ్చించి దేవతార్చనలు చేసుకుంటూ సుఖంగా భోజనం చేస్తూ గృహయజమాని వచ్చేవఱకున్నూ ఆయన కూడఁబెట్టిన సామానంతా వ్యయపరచి యజమాని వచ్చిన సడి కనిపెట్టి మెల్లిగా పప్పుజాటినట్టు జాటినారు. ఆయన యిల్లు చూసుకుంటే “అయ్యవార్లంగారి ನಿಬ್ಲಿಲ್ಲ” లాగేవుంది. ఆపట్టాన్ని పదార్ధమంతా యేమయిందని భార్య నడిగేటప్పటికి ఆ వెట్టి యిల్లాలు. మీరు చెప్పినవారు మీరూ గ్రామాంతరం దయచేసిన వుత్తర క్షణంలోనే వచ్చారుసుమండి! యింకా యిక్కడేవున్నారు. యిప్పడే యొక్కడికో వెళ్లారు. అంటూ యేమేమో చెప్పతూవుండగా పాపం! ఆగృహస్టు ++ నిర్ధాంతపోయి నీయమ్మకడుపు బంగారం గానూC నేను చెప్పినవారెవరే? అని అడిగేటప్పటికి - “మఱచిపోయారు కాcబోలును. శ్రావణభాద్రపదాలు ఇద్దరు" అని బదులు చెప్పింది. దానితో ఆయన ఎవరో మోసంచేసి తినిపోయారనుకొని పోనీ "సర్వం బ్రహ్మార్పణం" అని