పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కట్టుకోవడమే మానుకున్నారు. యివి యెంతబాధ పెట్టినాసరే యేదో బెదరించడమేకాని వీట్లను చంపడానికి మన హిందువులలో యెవరున్నూవప్పుకోరు. దీనిక్కారణం రామాయణ కాలంలో యీజాతి శ్రీరాములవారికి చేసిన సాయమే అనితోస్తుంది. సుమారు యేడెనిమిదేళ్లనాఁడు మావూల్లో వక కోఁతి ప్రవేశించి గృహస్టుల నందఱినీ అల్లకల్లోలపెట్టి బొత్తిగా నిలవనిచ్చిందికాదు. కోంతులు కుక్కలకు భయపడడం సర్వ సామాన్యంగా కనపడుతుంది. ఆ కోంతి కుక్కలను లక్ష్యపెట్టేదికాదు సరికదా వాట్లని పట్టుకొని చెంపకాయలు కొట్టేది. కోఁతిజాతిపగలేగాని రాత్రి చెట్టుదిగిరాదు. యీ కోఁతి రాత్రికూడా సంచరించేది. యిద్దఱు ముగ్గురుంటే తప్ప మనుష్యులమీఁద తిరగబడేది. యెక్కడో వక పిల్లిపిల్లను సంపాదించి దాన్ని వకకాలుతో పట్టుకొని తక్కిన మూండు కాళ్లతోటీ రెండు మూండురోజులు ప్రతి యింటిమీందను తిరుగుతూ వుండడంచూచి యిది చంటిపిల్లలినెక్కడ యెత్తుకుపోయి యీలాగే తిప్పతుందో అని గ్రామం గ్రామమంతా హడలిపోయారు. తుదకు ఆ పిల్లిపిల్ల దానిచేతిలోనే చచ్చింది. చెప్పేదేమిటంటే? యింత దుర్మార్గంగా వర్తించినప్పటికీ దాన్ని చంపడానికి యెవ్వరూ అంగీకరించలేదు. పట్టుకొని గోదావరి దాంటిస్తే వాళ్లకు కొంత సొమ్మివ్వాలని గ్రామస్టులు యేర్పఱచుకున్నారు. యెవశ్లో వచ్చి అందుకు ప్రయత్నంచేస్తూ వచ్చారు కాని వాళ్లకున్నూ అది దొరికిందికాదు. పట్టు కోవడమంటే మాటలా? మా గ్రామానికి అంటుమామిళ్లతోపాటుగా చాలాకాలాన్నుంచి దొంగలవల్లకూడా కొంత పేరు ప్రతిష్టలున్నాయి. దొంగలంటే? సామాన్యంగా కన్నాలేసే దొంగలున్నూ తోవలుకొట్టే దొంగలున్నూకారు. రాజులచేత మెప్పపొంది మడిమాన్యాలు గడించిన దొంగలు. ఆ మాన్యాలు యింకా అనుభవిస్తూవున్న కుటుంబాలు కొన్ని వున్నాయి. గర్భాధానంరోజున రాజుగారి కొమార్తె కట్టుకొన్న చీరెను చమత్కారంగా దొంగిలించి తెచ్చినప్పుడు అట్టి సమ్మానం జరిగినట్టు చెప్పకుంటారు. ఆ క్రీడాగృహానికి బల్లసరంబీ చేసివుంది. ఆ సరంబీమీంద సాధన సామగ్రితో యేలాగో ప్రవేశించి చిన్నరంధ్రం చేసి తద్ద్వారాగా తామర తూండుగుండా నిద్రాసమయంలో ఆమె కట్టుకున్న చీర తడిసేటట్టు చేయడముతోటట్టుగానే అది చాకిరేవుకు రావడం కలిగిందనిన్నీ అక్కడ నుంచి దొంగిలించడానికి సులువు కలిగిందనిన్నీ చెప్పకుంటారు. ఆలాటి చమత్కారపు దొంగతనాలు కుటుంబాలవాళ్లు మాతండ్రులరోజుల్లో యెవళ్ల దగ్గలేనా తృణమో వీసమో అప్పుచేయవలసివస్తే "యేలా తీరుస్తా?"వని అడిగే ఋణదాతకు - కోటిపల్లి తీర్థానికో - అంతర్వేది తీర్ధానికో తీరుస్తానని చెప్పడం కూడా యెఱింగినవాళ్లు నిన్న మొన్నటిదాంకా వున్నారు. వీళ్లు బ్రాహ్మలు వేదం చెప్పకొనేచోట యెందుకో కూర్చున్నట్టు కూర్చుని కొన్నిపప్పభౌట్లు సంగ్రహించి పరదేశాలకు వెళ్లి బ్రాహ్మణవేషంవేసుకొని సంపన్నులయిన బ్రాహ్మణగృహాల్లో దేవతార్చన బ్రాహ్మణులుగా చేరి గుటూమటూ కనిపెట్టి వీలిచ్చినప్పుడు