పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

787


పండితరాయలు : కాళిదాసు

1. పండితరాయలు, 2. కాళిదాసు వీరిద్దఱిలో యెవరిది నిగర్వ ప్రకృతి, యెవరిది సగర్వప్రకృతి? అని శంకించుకొని నాలుగు మాటలు వ్రాయాలని కుతూహలం కలిగింది, వ్రాస్తూన్నాను. "కో౽స్తి ధన్యోమధన్యతి" అన్నాఁడు జగన్నాథపండితరాయలు. శ్లోకం చాలా పెద్దది. "వాచామాచార్య తా యాఃపద మను భవితుం" అనేభాగాన్ని కలుపుకొని సమన్వయించుకుంటే మేరువుపర్వతం మొదలుకొని మలయపర్వతం వఱకు ఉన్న ధరామండలంలోవున్న పండితమండలిలో నాయెదట నోరువిప్పగలవాడంటూ ఉన్నాడా? అని ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతూవున్నట్లు స్పష్టమే. వాచ్యంగా తోఁచేదెంతో అంతేగాని దీనిలో యెంత ప్రయత్నించినా యితర విధయా వచ్చే అర్థంకానరాదు. ఆపద్ధతిని ఆయీ “రాయలు మహావిద్వాంసుఁడయ్యును విద్యకు ముఖ్య ఫలితం (విద్యయొసఁగును వినయంబు) వినయాన్ని బొత్తిగా మన్నించనేలేదు” యెన్నిసుగుణాలువున్ననూ అవి వినయంలేనిచో ప్రకాశింపవు.

శ్లో. విద్యావివాదాయ .... ఖలస్య సాధోః జ్ఞానాయ.
    నదీపారాజంతే వినయరహితా నామివగుణః.

యీ రాయలవారు రచించే రచనయావత్తూ పిల్లి మీఁదా ఎలుక మీఁదా పెట్టివుంటుందిగాని ప్రత్యక్షంగావుండదు. ప్రస్తుతశ్లోకం “ఆమూలాద్రత్నసానోః" అనేదిఅలాటిదికాదు. భూమండలంలో వుండే పండితులందఱూ తనకు ప్రత్యర్థులుగా వుండవచ్చునన్నమాట. “శా. నాతో మార్కొనలేరు... చేతుల్‌వేయు వృథా భరంబగుచు వచ్చెన్ దేవ! యీమేనికిన్" అన్న బాణుఁడూ పండిత రాయలూ వొక ప్రకృతికే సమన్వయిస్తారు.

శ్లో. విదుషాం నివహైః ... మయి జల్పతి ...
    రఘునాథేమనుతాంతదన్య దైవ.

కాళిదాసు ప్రకృతిలో గర్వంలేక పోలేదుగాని అది యీవిధంగా వుండదు. శ్లో మందః కవియశః ప్రార్థీ ... వామనః, లోఁతుగా పరిశీలిస్తే దీనిలోనూ గర్వస్ఫూర్తిని