పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

788

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వ్యాఖ్యానించవచ్చును. దీనిలోనేకాదు, “అభిరూపభూయిష్ఠా పరిషదియం, తదిహ కాళిదాస గ్రథితవస్తునా నవేన నాటకేనో పస్థాతవ్యం." అనేదానిలోనూ గర్వాన్ని యింతా అంతా కాదు బోలెఁడు చూపించవచ్చును. పిమ్మట చూచుకుందాం. రాయలవారికి అన్యాపదేశం కూడా వుదాహరించి విమర్శిద్దాం. "శ్లో. హేమ్నఃఖేదోన తాపో న చ్ఛేదినకషణేనవ, ఏతదేవ పరందుఃఖం, యద్గుంజా సమతోలనమ్” యిది కేవలం అన్యాపదేశం. తానేమోబంగారం, ప్రత్యర్థివిద్వాంసులు గురిగింజలు. పరీక్షాసమయాల్లో ఆయీ సంస్థాన విద్వాంసులందఱనీ ఆపట్టీలో (1) కస్తూరి (2) వుల్లిపాయ (3) అగరుబిళ్లలు (4) పొగాకు అని తారతమ్య విచక్షణ లేకుండా వ్రాయడానికి సహింపలేక కాఁబోలును.

శ్లో. హేన్నుః ఖేదోనతాపోన చ్చేదేన కషణేనచ
    ఏతదేవ పరందుఃఖం యద్గుంజాసమ తోలనమ్.

అనే శ్లోకంద్వారా కడుపుమంట తీర్చుకున్నాఁడని పండితులు చెప్పుకుంటారు. గద్వాల లోనైన నిజాం సంస్థానాలలో ప్రతియేటా కార్తీకంలో వేదశాస్త్రాలకున్నూ కవిత్వానికీ, గానానికీ యింకా కొన్నిటికీ మాఖమాసంలో నున్నూ, సత్కరించడమైతే వుందిగాని ఆసత్కారంకూడా తారతమ్య వివక్షతో సంబంధించినది కాకపోవుటచేత పండితరాయలవంటి అభిమానశాలికి అసత్కారంగానే కనపడుతుంది. కనుకనే-

ఉ. ఏకవియెట్టివాఁడొ? మరియేకవి కెట్టివిశేష పండిత
    శ్రీకలదో? విచారణము సేయుటయే కనకాభి షేకమౌ
    గాక తదన్య పద్ధతి జగమ్ము సమస్తము ధారవోసినన్
    జేకుఱునే ముదంబు పరిశీలన సేయుమి రామభూవరా?

ఉ. పండితులైన వారు ప్రతిభాగతి భాసురులౌట సర్వభూ
    మండలినుండు రాజులును మన్ననసేఁతురు వారిఁ
    బండితాపండితులైన వారల సభాస్థలినీవలెఁబూజసేయు ఱేఁ
    డుండునె? రామభూవర సమున్నత దాన విధానధీవరా.

అంటూ స్తుతి వ్యాజమున నిందించవలసి వచ్చినదని విజ్ఞులరయుదురుగాక. పండితులను సత్కరించుటకు యేభూపతికి కుతూహలంవుంటుందో ఆఱేనికి కేవలం ధనంమాత్రం వుంటేచాలదు. సద్బుద్ధియెంత వున్నప్పటికీ అదీ ప్రయోజనకారి గాదు. ఇంకా వుండవలసిన సాధన సామగ్రి యేమిటంటే :