పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/682

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

786

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఆయీపద్యద్వయానికి యేదో సన్నిహితబాంధవ్య మున్నదని తెలియుచున్నదిగాని విషయముమాత్రం చాలదూరం. వొకదానిలో రసం శృంగారం, వేఱొకదానిలో వర్ణ్యమే రసానికి సంబంధించేదో ఆలోచించాలి. నేను ఆయీచక్రవాకి సంతోషాన్ని ప్రకటించే శ్లోకాన్ని యెందుకు వ్యాఖ్యానించ వలసివచ్చిందో అదిన్నీ విచారణీయమే.

“ప్రయోజన మనుద్దిశ్య నమందో౽పి ప్రవర్తతే" యెవరయినా ఫలానా ప్రయోజనం ఆయీ శ్లోకాన్ని వ్యాఖ్యానించడానికి వుంది అని తెలిపితే సంతసిస్తాను. నాకు యేమీ తోcచనప్పు డీలా వ్రాస్తూవుంటాను. వాట్లలో అన్నిటికీ కాదుగాని యేకొన్నిటికో ప్రయోజనం వుంటేవుంటుంది. విజ్ఞులు విచారింతురుగాక.

★ ★ ★