పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

750

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యీ రోజుల్లో 'కులస్త్రీలు నాటకరంగాల కెక్కడం మంచిదికాదు. నాటకప్రదర్శకులలో బాహుళ్యంగా శీలసంరక్షణం మృగ్యం, వారికి తాగుడు యెక్కడోతప్ప వుండి తీరుతుంది;' యీ లాటి విశేషాలను బోధించే నాటకం వ్రాయడం తటస్థిస్తుందా? యీలా యే ఛాందసుఁడేనా వ్రాస్తే వాణ్ణిపట్టుకుని దులిపేయరా? యీలాటి యథార్థాన్ని మృదుమధుర శైలిలో నాటకం వ్రాయడం చేఁతకాదేమోకాని యీ యనకు వున్న పవిత్రమైన అభిప్రాయాలు వున్నవారు నవనాగరిక యువకులలో పలువురు వున్నారు. వృద్దులలో వున్నారని చెప్పనే అక్కరలేదు. శ్రీన్యాపతి భీష్ములవారు పనికట్టుకొని దీని నంతగా ప్రశంసించడమే వృద్దుల అభిప్రాయాన్ని తెలుపుతూ వుంది. శ్రీయుతులు చిల్కమర్తి కవిగారు సంఘసంస్కర్తలై వుండిన్నీ దీన్ని మిక్కిలిగా మెచ్చుకోవడం నేను నిన్న సమాజంలో విని వున్నాను. నవీన సంస్కర్తలమాట చెప్పలేనుగాని వృద్ధసంఘ సంస్కర్తలకు దీనిలోవుండే అంశాలు అభినందనీయాలని దీనివల్ల తెలుసుకోవలసి వచ్చింది.

“ప్రతిక్షణ విజృంభణాత్" అనే శ్లోకార్థంలాగ యిప్పుడు అన్ని విషయాలున్నూ క్షణేక్షణే మార్పు చెందుతూ వున్నాయి. ఆ మార్పులకు తలా తోcకా వున్నట్టు తోచదు. దారీ తెన్నూ అంతకంటే కనపడదు. యిట్టి రోజుల్లో యే ఛాందసులో యే మూలోకూర్చుని యెవళ్లువింటే యేంచిక్కు వస్తుందో అని భయపడుతూ గొణుక్కోవలసిన విషయాన్ని యే శ్రవ్య కావ్యంగానో వ్రాసి యేమూలో దాచవలసిన దానికి పబ్లీకుగా నాటకమంటూ వ్రాసి యెవళ్ల మనస్సుకూ నొప్పితగలకుండా వక కార్యాంశాన్ని బోధించిన యీకవి ధన్యుడు, మాన్యుఁడు, యాయన ప్రవృత్తిసర్వథా వసుచరిత్రలో భట్టుమూర్తి చూపిన వొక విషయాన్ని జ్ఞప్తికితెస్తూవుంది.

శా. మాయాశీలురు చంచలాత్ము లనుకంపాశూన్య లాత్మైక కా
     ర్యాయత్తుల్ సమయానుకూల రచనావ్యాపారగోపాయనో
     పాయజ్ఞుల్ మగవారలాపయి మహీపాలు ర్మహావైభవ
     శ్రీయోగాంధులు చెప్పనేల మగవారి న్నమ్మగా వచ్చునే?

యీపద్యంలో కృతినాయకుడైన శ్రీ తిరుమల రాయుణ్ణి యెంతో మృదువుగా మందలించినట్టు కనపడుతుంది. యీలాగే మనబంగారయ్య గారు క్రొత్తలోకాన్ని అనఁగా మందలించతగ్గలోకాన్ని మందలించారు. మందలింపు మందలింపుగాకాక మిక్కిలి శ్రోత్రపేయంగా వుందికూడాను. నన్నయితే యీయన అభిప్రాయాన్ని అడగలేదుగాని నా అంతట నేనేదీన్ని తోఁచి వ్రాశాను. అదిన్నీ కాక అడిగితే యిచ్చేది యీలా వుండనే