పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/647

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యలక్ష్మి

751


వుండదు. దాని కేర్పాటుగావున్న మాటలు యేర్పాటుగానేవుంటాయి. అవి మనియార్డరు ఫారాలలాగ అచ్చువేసి వుంచుకున్నా వుంచుకోవచ్చును. యీలా వ్రాయనక్కఱే లేదు. యీ గ్రంథకర్తరీతి చూస్తే చాలా అభివృద్ధిసూచకంగా నాకు తోస్తూవుంది. భగవంతుడు నా అభిప్రాయంతో యేకీభవించి యీయనకు సర్వథా శ్రేయఃప్రదాతయగుcగాక.

★ ★ ★