పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/642

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

746

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చెప్పఁగల వాఁడై వుంటే, గురువు మూకీభావం వహించడంగాని లేదా లోకానికి వ్యతిరిక్తంగా వాణ్ణిగూర్చి వుపన్యసించడం లేదా కేన్వాసింగు చేయడం గాని అది యుక్తంగా వుంటుందా? కనక గురువు తన సదభిప్రాయాన్ని ప్రచురించడమే యుక్తమని నాతలఁపు. రసారసవిచారం పట్ల గురుత్వ శిష్యత్వ జన్యత్వ, జనకత్వాదులు అకించిత్కరాలు. యెవరేనా సరే గుణముంటే మెచ్చవలసిందే అని నా సిద్ధాంతం - "మురారే స్తృతీయః పంధాః".

(షరా) వొకమాట ముఖ్యమైనదే మఱచాను, చాలామంది శిష్యులు నా మాదిరి చదువుతారు. యితఁడో నావలె మోహనరాగం కాక నాదనామక్రియా రాగంతో చాలా హృద్యంగా చదువుతాడు. నేను మాత్రం యితని మాదిరిని నాదనామక్రియతో చదవలేను. యీ శిష్యుడు సమానానాముత్త మశ్లోకోఅస్తు, ఇత్యాశీః, స్వస్తి.

★ ★ ★