పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



747


రాజ్యలక్ష్మి

పై పేరుతో వున్న వొక క్రొత్తనాటకమును గూర్చి కొన్నిమాటలు వ్రాస్తాను. నిన్నటిరోజున రాజమండ్రి హిందూసమాజములో మాటామంతీ ఆడుకుంటూ కూర్చున్నప్పుడు శ్రీయుతులు ఆంధ్రభీష్మ బిరుదాంకితులు శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులవారు కూడా అక్కడికి దయచేసినారు. శ్రీ పంతులవారు, శ్రీ నండూరి బంగారయ్య (వకీలు) గారిని ప్రశంసిస్తూ "మీ నాటకమును శాస్త్రుల్లుగారికి చూపినారా? అది యీలాటివారు తప్పక చూచి మెచ్చుకోదగింది” అనే అభిప్రాయమిచ్చే మాటలు పలికినారు. వెంటనే బంగారయ్యగారు తమ గృహమున కెవరినో పంపి ఒక పుస్తకాన్ని తెప్పించి నాకు యిచ్చినారు. నావోపిక "నానాటికి తీసి కట్టు నాగంభొట్టూ" అన్నస్థితిలో వుండడంచేత నిన్నరాత్రి చదవడానికి మొదలుపెట్టి ముగించలేక పోయానుగాని గ్రంథమందుండే సందర్భశుద్ధివగయిరా యేలాగేనా చదివితీరాలనే దీక్షను కలిగించడంచేత యీవేళ పూర్తిగా ప్రత్యక్షరశోధగా చదివి యెన్నడూ యేనూతన కవుల పుస్తకాన్ని చదివిన్నీ పొందనంతటి పరమానందాన్ని పొందఁగలిగాను. మృచ్ఛకటిక యెంత సందర్భశుద్ధి కలిగివున్నదో యిదికూడా అంత సందర్భశుద్ధిన్నీ కలిగివుందని వ్రాయడానికి జంకను.

కులస్త్రీలు నాటకరంగాలెక్కుటకు యెవో కొన్ని షరతులతో గ్రంథకర్త మెత్తబడడం తాత్పర్యంగా స్థూలదృష్టులకయితే తోస్తుందిగాని, మొత్తం తాత్పర్యం అదికాదన్నట్టు పరిశీలకతాదృష్టితో వివేచనచేస్తే, ప్రతివారికి గోచరిస్తుంది. స్త్రీలు నాటకరంగాలలో అభినయించడం యీ గ్రంథకర్తకు లేశమున్నూ యిష్టం లేదనే అంశం మిక్కిలి మృదువుగా బోధించిన యీకవిత్వ ప్రౌఢిమను యెంత వర్ణించినా తనివి తీరదు. యీయన శుద్ధఛాందసుఁడు కాకపోయినప్పటికీ ప్రస్తుతవిషయంలో ఆఛాందసుల అభిప్రాయాలే సర్వథా శ్రేయస్కాములకు ఆదరణీయాలుగా యీ నాటకంలో చిత్రించి వున్నారు. కులస్త్రీలు నాటకాలలోనూ, సినీమాలలోనూ అభినయపాత్రలుగా వుండవచ్చునని వాదించేవారు తీరా అది తమకు సంబంధించవలసి వచ్చేటప్పటికి యేస్థితికి రావలసి వస్తుందో యీయన బహు మృదువుగా బోధించారు. యింతమాత్రంచేత ప్రపంచకం మంచి స్థితికి వచ్చి