పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

738

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సుప్రసిద్దులునూ అయిన శ్రీకటు సూరన్న గారివద్ద ఫిడేలు ప్రారంభించి యేవో సరళీ, జంటూ మాత్రమే కాదు “సరిమాగరి సరిగరిసా" యింతేకాదు, దుర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు గారు రచించిన “రిప్పామ గరిసరి మ్మా" “యిటుజూడరా" యిత్యాదులు అభ్యసించాను. ఆ టయిము నేను గానానికి వినియోగిస్తే, మాతిర్పతిశాస్త్రి తర్కం అభ్యసించడానికి వినియోగించాడు. అదీ యిదీ యే కొంచెమో అన్న స్థితిలో వుండగా శ్రీరాజావారి దర్శనం కావడం, సన్మానం జరగడం వగయిరాలు సందర్శనంలోనూ, జాతకచర్యలోనూ చూచుకోండి. ప్రసక్తానుప్రసక్తంగా చాలా దూరం వచ్చాం.

సంగీతాన్ని అభ్యసించడానికి మైసూరు శ్రీవీణ శేషన్నగారివద్దకు ప్రయాణం కట్టడానికి వారి పరిచయం గద్వాలాదులలో వారి శిష్యుల ద్వారాగా నైతే వుందిగాని, ఆయీ పరిచయం నాకు వుపకరించడానికి బదులు అపకరించేటట్టు కనపడి ప్రయాణం ఆగిపోయింది. అపకరించడానిక్కారణం వివరించనక్కఱలేదుగాని, అయినా కొంచెం సూచిస్తాను : ఈ సంగీతాభ్యాస కుతూహలం నాకు కలిగేటప్పటికి ఆంధ్రదేశంలో తి.వెం. కవులంటే యెఱగని వారులేరు. అట్టి స్థితిలో సంగీతానికి గురు శుశ్రూష చేయడానికి వెడితే గురువుగారు యితరులతోపాటు చేర్చుకొని (శుశ్రూష) చేయించుకుంటారా? విద్యాభ్యాసానికి యేర్పడ్డ మూడిటిలో (శుశ్రూష, సమృద్ధిగా ధనప్రధానం, ఒక విద్య తనది యిచ్చి వారిది మఱివకటి స్వీకరించడం) శుశ్రూషవల్ల సంపాదించిన విద్యే శోభిస్తుంది.

చ. గురుకులవాసమున్ జరిపి కూరిమి మాధుకరమ్ము వారముల్
    జరుపుచు, అమ్మ గాని యొక సాధ్విని 'అమ్మ! యటంచు, 'బా' బటం
    చొరులను గొల్చి నేర్చితిమి యొండొకశాస్త్రము ... ... -
                                                                           (గుంటూరిసీమ)

అందులోనూ, గానానికి చేసే శుశ్రూష (ఉపచారం) మఱీ విలక్షణంగా వుంటుంది. తంబురాపట్టుకుని గురువుగారివెంట తాడుతోదబ్బనంగా సభలకు వెళ్లడం, అప్పుడప్పుడు అంట్లతప్పేలాలు తోమడం - యీ పనులుగాక గురువుగారి నీర్మావిదోవతులు వుతకడం యివన్నీ చేసినా గురువుగారి వెంట తంబురా మీటడం తప్ప స్వరజ్ఞానం మర్మం విడిచి తెలియఁజెప్పే గురువు లెక్కడో గాని, వుండరనే వినడం. భవతు.

ప్రధానాంశం విడిచి, చాలాదూరం వచ్చాం. ఆయీ శుశ్రూషలు చేయించుకొనే గురువులు వున్నట్లు వినడమే కాని, నాకు తటస్థించలేదు. యింగ్లీషువిద్యార్థి బూట్సుకాళ్లతో వచ్చి క్లాసులో కూర్చుంటాడు. ఆ మాదిరిగా మాత్రం మన విద్యలు అభ్యసించే విద్యార్థులు వుండరు.